»   » బాలకృష్ణలో ఎంత పవర్ ఉందో తెలుస్తుంది

బాలకృష్ణలో ఎంత పవర్ ఉందో తెలుస్తుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

"వేరే ఏ పేరు పెట్టినా ఈ సినిమాకి సరిపోదు. 'సింహా' అయితేనే కరెక్టు. బాలయ్య నుంచి ఎంత పవర్ తీసుకొచ్చామో సినిమా చూశాక ప్రేక్షకులకి తెలుస్తుంది. ఒక ప్రేక్షకుడిగా ఆలోచించి, ఈ సినిమా చేస్తున్నా. ఆయన ఎలా కనిపిస్తే బావుంటుందా? అని ఆలోచించేవాణ్ని. ఆ వూహాలకీ, ఆలోచనలకీ దృశ్యరూపమే సింహా. నాకు అప్పగించిన బాధ్యతను వంద శాతం నెరవేర్చాననే అనుకుంటున్నా. బాలయ్య ఇందులో కొత్తగా కనిపిస్తారు.ఆయన నటన సినిమాకి హైలైట్" అని దర్శకుడు బోయపాటి శ్రీను తన తాజా చిత్రం 'సింహా' గురించి చెప్పుకొచ్చారు.నయనతార, నమిత, స్నేహా ఉల్లాల్‌ హీరోయిన్స్ గా చేసిన ఈ సినిమాకి సంబంధించిన అమెరికా ప్రదర్శన హక్కుల్ని సుప్రిమ్‌ రాజు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సందర్బంగా యునైటెడ్ మూవీస్ అధినేత పరుచూరి శివరామ్‌ప్రసాద్ మాట్లాడుతూ "మేం మునుపు తీసిన మూడు సినిమాలూ నిరాశ పరిచిన మాట వాస్తవం. మా నాలుగో సినిమాకి బాలకృష్ణగారు అవకాశమిచ్చారు. దీన్ని తీర్చిదిద్దే బాధ్యతని బోయపాటి శ్రీనుకి అప్పగించాం. మార్కెట్లో 'సింహా'కి మంచి క్రేజ్ వొచ్చింది. సినిమా పెద్ద హిట్టనే టాక్ పరిశ్రమలో నడుస్తోంది. సుప్రీమ్ రాజు అమెరికాలో ఈ సినిమాని విడుదల చేయడానికి ముందుకురావడం ఆనందంగా ఉంది" అన్నారు.

సుప్రీమ్ రాజు మాట్లాడుతూ..మన తెలుగు చిత్రాలకు అమెరికాలో ఆదరణ ఎంతో బాగుంది. ఇంతకు ముందు 'మగధీర' విజయవంతంగా విడుదల చేశాం. ఇప్పుడు 'సింహా' హక్కులు దక్కడం ఆనందంగా ఉంది. ఆ దేశంలో 25 కేంద్రాల్లో విడుదల చేస్తాం. దాదాపు వెయ్యి ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో నమిత, స్నేహా ఉల్లాల్‌, చక్రి, డివివి దానయ్య, సాగర్‌, సురేందర్‌రెడ్డి, జీవీ, నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu