»   » వర్మ'రక్ష' ను నిషేదించాలంటూ ఆందోళన

వర్మ'రక్ష' ను నిషేదించాలంటూ ఆందోళన

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ హిందీలో రూపొందించిన ఫూంక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన రక్ష చిత్రం హిట్ టాక్ మాటేమో గానీ అప్పుడే వివాదాలను ముడివేసుకుంటోంది. మూఢ నమ్మకాల్ని జనంపై రుద్దేలా రక్ష తెరకెక్కిందంటూ అఖిల భారత మహిళా సంఘం(ఐద్వా) కార్యకర్తలు హైద్రాబాదాలోని ఓ ధియోటర్ వద్ద ఆందోళన కార్యక్రమాలను నిర్వర్తించారు. అలాగే రక్ష సినిమా పోస్టర్స్ ని చింపివేసి,సినిమా ప్రదర్శనను నిలిపివేయాల్సిందిగా డిమాండ్లు చేసారు.

ప్రజలను చైతన్యవంతులను చేయాల్సింది పోయి,మూఢ నమ్మకాలను వారిలో ఇంజెక్టు చేసే విధంగా చిత్రాలు నిర్మించటం కాదని,ఇలాంటి చిత్రాలకు సెన్సార్ అనుమతి ఇవ్వరాదని వారు డిమాండు చేసారు. ఐతే ఈ ఆందోళన సినిమా కొనసాగటంపై ఏమైనా ప్రభావం చూపుతుందా అంటే లేదని... కానీ పబ్లిసిటీకి బాగా ఉపయోగపడుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జగపతి బాబు,కళ్యాణి జంటగా ఆకెళ్ళ వంశీకృష్ణ రూపొందించిన ఈ హర్రర్ సినిమా భాక్సాఫీస్ వద్ద పెద్ద ప్రభావం చూపటం లేదని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X