»   »  దిమ్మతిరిగే సమాధానం చెప్పింది

దిమ్మతిరిగే సమాధానం చెప్పింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరారాబ్ద : ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి డిమాండ్ వున్న హీరోయిన్ ఎవరూ అంటే రకుల్ అనే చెప్పారి. రీసెంట్ గా నాన్నకు ప్రేమతో సినిమాలో దివ్యాంక క్యారక్టర్ లో నటించిన ఆమె . ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో తన రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెంచేసిందని టాలీవుడ్ టాక్. దాంతో ఎప్పటిలాగే మీడియాలో ఈ వార్త ప్రముఖంగా రావటం మొదలైంది.

ఇదే ప్రశ్న మీడియావారు రీసెంట్ గా ఆమెను అడిగితే రివర్స్ లో దిమ్మతిరిరేలా సమాదానం ఇచ్చింది. అదేంటంటే... అందరికీ వాళ్ల స్ధాయిని బట్టి రెమ్యునరేషన్ పెంచుకునే అవకాశం వుందని, ఇలాంటి ప్రశ్నలు నేను కెరీర్ లో మెదలైనప్పుడు ఎవరూ అడగలేదు, ఇప్పుడెందుకడుగుతున్నారో అర్దంకావడంలేదని, నాకు ఆరు లక్షలిచ్చినప్పుడు ఇలాంటి సమస్య రాలేదని, అయినా నిర్మాతలు చెల్లించగలిగినంత మాత్రమే నేను చార్జ్ చేస్తున్నానని బదులిచ్చింది. ఈ జవాబుతో అందరికి దిమ్మతిరిగనట్లైంది.

వెంకటాద్రి ఎక్సప్రెస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె తర్వాత రామ్ సరసన పండుగ చేస్కో, రవితేజ సరసన కిక్ 2 చిత్రాలు చేసింది. ఆ తర్వాత ఈమె సుకుమార్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందనున్న నాన్నకు ప్రేమతో చిత్రం సైన్ చేయటంతో దశ మారిపోయింది. దాంతో ఆమెకు పెద్ద హీరోలు నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. దానికి తగినట్లే ఆమె రెమ్యునేషన్ ని పెంచేసుకుంటూ వెళ్తోంది.

Rakul Preet Singh intelligent Answer

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఇచ్చిన కిక్‌తో ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. అరడజను సినిమాలతో తిరిక లేకుండా గడుపుతోంది. మరోవైపు అప్పడప్పుడూ హిందీ సినిమా ల వైపూ ఓ చూపు చూస్తోంది. దీంతో రకుల్‌ ఇప్పుడు యమ బిజీ బ్యూటీ అయిపోయింది.

''రోజూ చిత్రీకరణ ముగిసి ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు నేనే ఓ ప్రశ్న వేసుకొంటున్నా. ''ఈ రోజు ఇక్కడ నేనేం నేర్చుకొన్నా..' అని. ప్రతిసారి సంతృప్తికరమైన సమాధానం దొరుకుతోంది. అందుకే మరుసటి రోజు మరింత ఉత్సాహంగా సెట్‌లోకి అడుగుపెడుతున్నా..'' అంటోంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌.

''స్కూల్‌కి ఎంత హుషారుగా వెళ్లేదాన్నో... సెట్స్‌కీ అలానే వెళ్తున్నా. చుట్టూ నా మనుషులే ఉన్నట్లుంది. రోజూ చిత్రీకరణ ఉంటే బాగుంటుందనిపిస్తోంది. నేను సినిమాలకు కొత్త. అందుకే ప్రతిదీ నాకు వింతగా అనిపిస్తోంది. ఇవన్నీ ఎంత త్వరగా నేర్చుకుంటానా అనే ఆత్రుత ఉంది. ప్రస్తుతానికి నేర్చుకొనే దశలో ఉన్నాను. ఒకట్రెండు తప్పులు చేసినా సెట్లో దర్శకులు పెద్ద మనసుతో క్షమించేస్తున్నారు'' అని చెబుతోంది రకుల్‌.

English summary
In one of Rakul Preet Singh recent interviews, she was asked about remunation and she came up with an intelligent answer.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu