»   » ‘ధ్రువ’ టైటిల్ ఖరారు: రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ఇదే...

‘ధ్రువ’ టైటిల్ ఖరారు: రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ఇదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో హిట్టయిన 'థాని ఒరువన్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. కొంత కాలంగా ఈ సినిమాకు 'ధ్రువ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇపుడు అదే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

ఈ చిత్రం కోసం రామ్ చరణ్ కఠినమైన ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. తాను చేసేది చాలా టఫ్ రోల్ కావడంతో పాత్రకు తగిన విధంగా తయారయ్యేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా రోజూ గంటల తరబడి జిమ్ ట్రైనింగుతో పాటు హార్స్ రైడింగ్, సైక్లింగ్ చేస్తున్నారు. సినిమాలో పాత్ర కోసం రామ్ చరణ్ కాస్త బరువు కూడా తగ్గాడు.

Ram Charan's Dhruva first look

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే మొదలు కావాల్సి ఉన్నా... రామ్ చరణ్ సోదరి శ్రీజ వివాహం కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం రామ్ చరణ్ అన్ని పనుల నుండి ఫ్రీ కావడంతో సినిమా షూటింగులో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో రామ్ చరణ్ కొత్తగా కనిపించబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అరవిందస్వామి ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా, అసీమ్ మిశ్రా సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. దసరా నటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బేనర్లో అల్లు అరవింద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
Ram Charan's upcoming film Dhruva first look released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu