»   » ఇంతకు మించి కోరుకోవడం లేదు: బాబాయ్ పవన్ ట్వీటుపై రామ్ చరణ్

ఇంతకు మించి కోరుకోవడం లేదు: బాబాయ్ పవన్ ట్వీటుపై రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అన్నయ్య చిరంజీవి హీరోగా.... వదినమ్మ సురేఖ, రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న 'ఖైదీ నెం 150' సినిమా ప్రీ రిలీజ్ పంక్షన్ కు బిజీగా ఉండటం వల్ల రాలేక పోయిన పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా వారిని విష్ చేసిన సంగతి తెలిసిందే.

చరణ్, మా వదిన సురేఖ గారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150వ చిత్రం కావడం చాలా ఆనందంగా ఉంది. ఖైదీ నెం 150 ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా మన: పూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసారు.

పవన్ ట్వీటుపై తాజాగా రామ్ చరణ్ స్పందించారు. థాంక్యూ బాబాయ్.... ఇంతకు మించి నేను మీ నుండి ఇంకేమీ కోరుకోవడం లేదు అని రామ్ చరణ్ రిప్లై ఇచ్చారు.


మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కత్వ ంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ నిర్మించిన‌ ఖైదీనంబ‌ర్ 150 చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌ల అవుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ పదేళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

English summary
Ram Charan who is producing his dad Chiranjeevi’s 150th film in a prestigious manner, thanked his Babai for the love and affection. He posted “Thanks for your best wishes Babai! Means a lot to me.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu