»   » మెగా ఫ్యాన్స్ మీకోసమే ఈ ఫొటో: మట్టి గణేషుడితో ఉపాసన, రామ్‌చరణ్ ఫొటో

మెగా ఫ్యాన్స్ మీకోసమే ఈ ఫొటో: మట్టి గణేషుడితో ఉపాసన, రామ్‌చరణ్ ఫొటో

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ భార్య ఉపాసన అప్పుడు తన సోషల్ మీడియా పేజీ ద్వారా తన ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ ఫోటోలను చరణ్ షేర్ చేస్తూ రామ్ చరణ్ అభిమానులను, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ను సర్‌ప్రైజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఉపాసన ఇటివల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉటుంది. ముఖ్యంగా రామ్ చరణ్ కు సంబధించిన ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుటుంది.

ఇప్పుడు లేటెస్ట్ గా ఉపాసన చేసిన పోస్ట్ ఏంటంటే.. తన భర్త చరణ్ తో కలిసి.. వినాయకుడి ప్రతిమను చేతుల్లో పట్టుకున్న ఫోటో. నవరాత్రుల పాటు ఇంటింటా పూజలు అందుకుని నిమజ్జనానికి గణేషుడు బయల్దేరుతుండగా.. తమ ఇంటి గణపతిని కూడా నిమజ్జనం చేస్తున్నామనే సంగతిని ఇలా ఓ ఫోటో ద్వారా చెప్పింది ఉపాసన.

Ram Charan, Upasana Kamineni Wave Goodbye to Ganesh

అయితే.. ఈ ఫోటోలో కాషాయం రంగు టీ షర్ట్.. బ్లాక్ కలర్ లుంగీతో చెర్రీ లుక్ ను చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. పైగా బాగా గుబురుగా పెంచిన గెడ్డం లుక్ లో మెగా పవర్ స్టార్.. తన పవర్ చూపించేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రంగస్థలం1985 షూటింగ్ స్పాట్ పిక్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి కానీ.. చరణ్ లుక్ ఇంత స్పష్టంగా తెలియడం మాత్రం ఇదే.

ఇక తమ గణేషుడిని పంపేస్తున్నట్లు చెప్పిన ఉపాసన.. బైబై చెబుతూనే ఓ మంచి సందేశం కూడా ఇచ్చింది. "బైబై గణేషా.. దయచేసి ఆశీర్వదించు.. అలాగే అందరి కలలను నెరవేర్చు. ముఖ్యంగా తమ మంచి ప్రవర్తనతో.. సంతోషాన్ని పంచాలనే ఆలోచన ఉన్న వారి కలలను తప్పకుండా నెరవేర్చు" అంటూ వినాయకుడికి తన విన్నపాన్ని అందించింది ఉపాసన.

Ram Charan with Mani Ratnam : Reason Revealed Behind Of That - Filmibeat Telugu
English summary
It feels good to see our stars having the family time. Here is the Ganesh Visarjan event picture of Ram Charan posted on social media with a tag line asking god to bless and fulfil everyone’s dreams who wants to spread positivity.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu