»   » రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం 'డిపార్డ్ మెంట్'

రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం 'డిపార్డ్ మెంట్'

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ కొద్ది రోజుల క్రితం కంపెనీ-2 చిత్రాన్ని రూపొందిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రానికి డిపార్ట్ మెంట్ అనే పేరుని కన్ఫర్మ్ చేసారు. పోలీస్ ప్రపంచాన్ని ఈ చిత్రంలో చూపెట్టబోతున్నారు. తన బ్లాగ్ లో ఓ వ్యక్తి సూచించిన ఈ టైటిల్ ని ఆయన తీసుకున్నారు. అలాగే ఈ విషయాన్ని ఆయన చెపుతూ ఈ డిపార్టమెంట్ అనే టైటిల్ ని అనుకున్న తర్వాత కంపెనీ-2 అనేది అర్ద రహితంగా రాంగ్ టైటిల్ గా అనిపించింది. పోలీస్ వ్యవస్ధపై తీసే చిత్రానికి డిపార్టమెంట్ సరైన టైటిల్ అనిపించింది అంటున్నారు. అండరగ్రౌండ్ వరల్డ్ ని ఓ డాన్ రన్ చేస్తూంటాడు. అయితే పోలీస్ వ్యవస్ధ డాన్ మాత్రం డిపార్డ్ మెంట్. ఇక ఇంతగా వివరించాను కాబట్టి డిపార్టమెంట్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు ఆ సినిమాకి అని మాత్రం అడగొద్దు అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రణ్ ఈ మధ్యనే రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అమితాబ్, రితీష్ దేశముఖ్, నీతూ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రం మీడియా బ్యాక్ డ్రాప్ లో వచ్చింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu