»   » ప్రేక్షకుడికి చెమటలు పట్టించాలనే...రామ్ గోపాల్ వర్మ

ప్రేక్షకుడికి చెమటలు పట్టించాలనే...రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా టెక్నికాలిటీ ద్వారా ప్రేక్షకుడికి చెమటలు పట్టించడమే తన లేటెస్ట్ చిత్రం 'ఆవహం లక్ష్యం అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన సమర్పణలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మిలింద్ గడాక్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఆవహం". ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బుర్రా ప్రశాంత్, రామ్ గోపాల్ వర్మ మీడియాను కలిసారు. రామ్ గోపాల్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. రైటర్ మిలింద్ 'ఫూంక్ "కి సీక్వెల్‌గా 'ఆవహం" అనే ఐడియాతో నా దగ్గరకు వచ్చి ఓపెనింగ్ సీక్వెన్స్ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. 'ఫూంక్" సినిమా కథ చేతబడి లాంటి క్షుద్రశక్తులు తెలిసిన ఒక మంత్రగత్తె తన స్వప్రయోజనాల కోసం ఓ చిన్న పిల్లని హింసిస్తూ చంపే ప్రయత్నంలో ఆ అమ్మాయి తండ్రిని అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది.

తన పాపను రక్షించుకునే ప్రయత్నంలో ఆ తండ్రి ఒక మంత్రగాడ్ని కలిసి అతని సహాయంతో ఆమెను చంపుతాడు. ఇప్పుడు 'ఆవహం"లో మొదటి చిత్రంలో చనిపోయిన ఆ మంత్రగత్తె ప్రేతాత్మ రూపంలో తిరిగొచ్చి, తన మరణానికి కారణమైన మాంత్రికుడ్ని చంపడం దగ్గర్నుంచి ప్రతీకారం మొదలెట్టడంతో సినిమా మొదలవుతుంది. ఇక 'ఫూంక్ "లో ప్రధాన పాత్ర అనుభవించిన పరిస్థితుల కన్నా కూడా అత్యంత దుర్భరమైన పరిస్థితులు 'ఆవహం"లో వుంటాయి. ఎప్పుడయితే ఆమె ఓ ప్రేతాత్మరూపంలో తిరిగొచ్చి, రక్షించిన ఆ మాంత్రికుడ్ని బలి తీసుకున్నప్పుడు ఆ కుటుంబం పరిస్థితేంటి? ఈ ఆలోచన ఎంత భయంకరంగా వుందో..అంతకంటే ఎక్కువ భయపెడుతుందీ సినిమా. ఇక ఈ చిత్రాన్ని సార్థక్ మూవీస్ ప్రై.లిమిటెడ్, జడ్ త్రీ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో నిర్మించామని ప్రొడ్యూసర్..బుర్రా ప్రశాంత్ తెలిపారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu