»   » రామ్ గోపాల్ వర్మ శిష్యుడుతో.. 'గాయం 2'

రామ్ గోపాల్ వర్మ శిష్యుడుతో.. 'గాయం 2'

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్‌ గోపాల్‌ వర్మ శిష్యుడు ప్రవీణ్‌ సి. ఈ చిత్రానికి దర్శకుడు అవ్వడం ఓ విశేషం అయితే...జగపతి బాబు ఈ చిత్రానికి సమర్పకుడు అవ్వడం మరో విశేషం' అంటూ 'గాయం 2' విశేషాలు లైన్‌ ప్రొడ్యూసర్‌ భరత్‌ సి. మీడియాకు తెలియచేస్తూ చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే..."ఇందులో కొత్త జగపతిబాబును చూస్తారు. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. విమలారామన్‌ ఇందులో ప్రాధాన్యం గల పాత్ర చేస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 1 నుంచి బ్యాంకాక్‌లో చిత్రీకరణ మొదలైంది. 20 వరకూ ఇక్కడే జరుగుతుంది. కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నాం' అని తెలిపారు. అలాగే ఒకప్పుడు జగపతిబాబు ఇమేజ్‌ని మార్చిన 'గాయం' చిత్రానికి కొనసాగింపు అయిన 'గాయం 2' చిత్రం మేం చేయడం ఆనందంగా ఉంది అన్నారు. అలాగే చిత్ర హీరో జగపతిబాబు మాట్లాడుతూ..."కెరీర్‌ ప్రారంభించి 21 ఏళ్లయింది. సుదీర్ఘమైన ఈ ప్రస్థానంలో ఎన్నో వెరైటీ సినిమాలు చేశాను. ఏ టైపాఫ్‌ సినిమాలో నటించినా..ఎలాంటి క్యారెక్టర్‌ చేసినా నన్ను చూశారు. ఇప్పుడు చేస్తున్న 'గాయం 2' కూడా నా కెరీర్‌లో ఓ వైవిధ్యమైన చిత్రం. తప్పక ఆదరిస్తారని నా నమ్మకం' అని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu