»   » ఇలియానా, నిత్యమీనన్‌లతో పోలుస్తూ...కేసీఆర్‌పై వర్మ ట్వీట్లు

ఇలియానా, నిత్యమీనన్‌లతో పోలుస్తూ...కేసీఆర్‌పై వర్మ ట్వీట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ట్విట్టర్లో కామెంట్స్ చేసారు. సినిమా హీరోయిన్లు ఇలియానా, నిత్యా మీనన్, పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్, జర్మన్ నియంత హిట్లర్లతో కేసీఆర్ ను పోలుస్తూ వర్మ ట్వీట్లు ఆసక్తికంగా ఉండటం గమనార్హం.

‘ఇలియానా కంటే కేసీఆర్ అందంగా ఉంటారు. కానీ ప్రస్తుతం ఆయన పెర్ఫార్మెన్స్ నిత్యామీనన్ కంటే బెటర్ గా ఉంది. అయితే ఇది చెడులో మంచా? లేక మంచిలో చెడా? అనే విషయం నాకు అర్థం కావడం లేదంటూ వర్మ ట్వీట్ చేసారు. కొన్ని విషయాలో కేసీఆర్ హిట్ల కంటే తక్కువ...టాలెంట్ విషయంలో మైఖేల్ జాక్సన్ కంటే ఎక్కువ. అందుకే ఆయన ప్రజలు ఇష్టపతారు అంటూ ట్వీట్ చేసారు.

గతంలోనూ వర్మ కేసీఆర్ గురించి ట్విట్టర్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసారు. సమంత,తమన్నా, ఇలియానా కలిపితే ఉండే అందమంతా కేసీఆర్ లో కనిపిస్తోందంటూ వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపారు. హిట్లర్ ఓ చెడ్డ కేసీఆర్...కానీ కేసీఆర్ ఓ మంచి హిట్లర్ అంటూ ఓ వ్యాఖ్యను కొసమెరుపుగా పోస్ట్ చేసారు. తాను కొత్తగా కేసీఆర్‌ పేరుతో చిత్రం తీస్తున్నట్టు దర్శకుడు రాంగోపాల్‌వర్మ ట్విట్టర్‌లో తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి మంచి పాలన అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే ...కేసీఆర్ అనే పదం ఎన్ టీఆర్ అనే పదం కంటే వినటానికి ఇంకా బాగుంటుందని మరో ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు. అధికారం, దర్పం లాంటి అంశాలు కేసీఆర్ ను అందగాడిని చేసాయి అన్నారు.

English summary
"Kcr is lesser than Hitler in subversity,more than Michael Jackson in versatility and that's why I think People love his adversive diversity" Ram Gopal Varma tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu