»   »  చూసితీరాల్సిన అధ్భుతం!!

చూసితీరాల్సిన అధ్భుతం!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ramchandra Pakistani
రంజాన్ సందర్భంగా దేశమంతటా రిలీజైన పాకిస్ధాన్ చిత్రం 'రామ్ చంద్ పాకిస్ధానీ'. నందితాదాస్ ప్రధాన పాత్రలో నిర్మించిన ఈ చిత్రం అందరి ప్రశంసలూ పొందుతూ భాక్సాఫీస్ వద్దమ మంచి వసూళ్ళనే సాధిస్తూ ముందుకెళ్తోంది. మనకూ,పాకిస్ధాన్ కి ఉన్న బోర్డర్ గ్రామంలో( పాకిస్ధాన్) నివసించే రామ్ చంద్ అనే హిందూ దళిత ఎనిమిదేళ్ళ కుర్రాడు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వాడు ఓ రోజు బొర్డర్ లైన్ తెలియక ఆడుకుంటూ వెళ్ళి భారత సైనికులకు పట్టుపడతాడు. తర్వత వాడ్ని వెతుక్కుంటూ వచ్చిన వాడి తండ్రి శంకర్ ని వారు పాకిస్ధాన్ ఏజెంట్,బోర్డర్ అక్రమంగా దాటాడు అన్న నేరంపై పట్టుకుని గుజరాత్ జైలుకు పంపుతారు. అక్కడ తండ్రి కొడుకులు తాము చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఎప్పుడు విడుదల అవుతామా అని రోజులు లెక్కిస్తూంటారు.

మరో ప్రక్క రామ్ చంద్ తల్లి చంప(నందితాదాస్) హఠాత్తుగా మాయమైన భర్త,కొడుకు గురించి ఏ విషయం వార్తా తెలియక తికమక పడుతూంటుంది. మరో ప్రక్క తమ భర్త చేసిన అప్పు తీర్చటానికి మూడేళ్ళ పాటు ఓ మోతుబరి పొలంలో కూలీగా పనికి కుదురుతుంది. ఐదేళ్ళు గడుస్తాయి...ఆమె మనస్సు లో ఇక నిర్ణయించుకుంటుంది. ఇక భర్తా,కొడుకు రారని, వారు చంపబడ్డారని,మిగతా జీవితాన్ని కొనసాగించేందుకు తన వెంట పడుతున్న వ్యాపారితో జత కట్టేందుకు రెడీ అవుతుంది. ఇంతలో రామ్ చంద్ ని విడుదల చేయమని ఫర్మిషన్ వస్తుంది. వాడు వెళ్ళనంటాడు. ఎందుకంటే తన తల్లి అక్కడుందో లేదో....తెలియదు...ఉన్న ఒక్కగానొక్క తండ్రిని ఒంటరిగా వెళ్ళే ఆలోచన లేదంటాడు. అంతేగాక తమని తల్లినుండి దూరం చేసాక,తాము ఇక్కడున్నామన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటాన్ని తన చిన్న గుండెలో ధైర్యం తెచ్చుకుని నిలదీస్తాడు. కానీ తప్పని పరిస్ధితుల్లో మనుషులను,దేశాల్ని విడతీసే చట్టాన్ని అనుసరిస్తూ...గౌరవిస్తూ...బయిట వెళ్తాడు.

ఇక ఈ సినిమాలో సార్వజనీనంగా ప్రపంచం అంతా అనుసరిస్తున్న బోర్డర్ విధానాన్ని మన దేశం,పాకిస్ధాన్ అనుసరించకపోవటాన్ని నిలదీస్తుంది.ఎంతోమంది దీనులు తాము చేయని తప్పుకి జైల్లో మగ్గుతూ తమ ఇంటి దగ్గరవారు ఏమయ్యారో ...తమ నాన్న తమ పెళ్ళి కోసం మిగతావారిని ఆపుతున్నారని, తన పిల్లలు ఏం చేస్తున్నారో అని రకరకాల బెంగపడటం చూపి వాస్తవాల్ని మన ముందుంచుతాడు. అలాగే పాకిస్ధాన్ లో మైనారిటీలు అయిన హిందువులు అందులోనూ మరీ మైనారిటీ వర్గాలుగా మిగిలి పోయిన దళితుల సమస్యలను దర్శకురాలు ఆర్ద్రంగా సృశిస్తుంది. అంతేగాక బోర్డర్ గ్రామాల వద్దే సెట్స్ వేయకుండా షూటింగ్ జరిపి వాస్తవికతను కళ్ళెదురుగా నిలిపే ప్రయత్నం చేయంటం ముచ్చటేస్తుంది. ఖుదాకేలియా తర్వాత మనదేశంలో రిలీజయిన ఈ పాకిస్ధానీ సినిమా పై దర్శక,నిర్మాతలు పెట్టుకున్న ఆశలు సఫలమయ్యేటట్లు ఉన్నాయి. మంచి సినిమాలను ఇష్టపడేవారికి బాగా నచ్చే సినిమా ఇది ...ట్రై చేస్తే నిరాశ పడరు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X