»   » 'హోమో సెక్సువల్' ఆరోపణలపై వర్మ మౌనం: స్పందించకపోవడం వెనుక కారణమేంటి?

'హోమో సెక్సువల్' ఆరోపణలపై వర్మ మౌనం: స్పందించకపోవడం వెనుక కారణమేంటి?

Subscribe to Filmibeat Telugu
వర్మ 'హోమో సెక్సువలా ? ఆరోపణలపై వర్మ మౌనం

చర్చ దేనిపై అయినా సరే.. తనదైన ఓ థియరీని ముందుపెట్టి ఎదుటోళ్లను ప్రశ్నల కోసం వెతుక్కునేలా చేస్తాడు వర్మ. సమాజానికి తప్పో.. ఒప్పో.. ఆయనకు అనవసరం. తన కోణం నుంచి అది వంద శాతం సరైందనేనని వాదించగలడు. అలాంటి వర్మ.. ఓ విషయంలో మాత్రం అసలు నోరు మెదపకపోతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది అంటున్నారు.

'హోమో'ఆరోపణలపై ఆర్జీవి మౌనం :

'హోమో'ఆరోపణలపై ఆర్జీవి మౌనం :

రచయిత జయకుమార్ రాంగోపాల్ వర్మపై 'హోమో సెక్సువల్' ఆరోపణలు చేస్తున్నారు. వర్మ టీమ్ లో పనిచేసిన సమయంలో.. తనను లైంగికంగా వేధించాడని జయకుమార్ ఆరోపిస్తున్నారు. హోటల్ రూమ్స్ కు రావాలని తన లైంగిక కోరికలు తీర్చాలని వర్మ ఒకరకంగా తనకు నరకం చూపించడాని ఆయన వాపోతున్నారు.

స్క్రీన్ షాట్స్ చూపించాడు..:

స్క్రీన్ షాట్స్ చూపించాడు..:

ఆరోపించడమే కాదు.. వర్మ తనకు పంపించిన అసభ్య మెసేజ్ లను కూడా జయకుమార్ బయటపెట్టారు. వాట్సాప్ స్క్రీన్ షాట్స్‌ను ఓ మీడియా ఛానెల్‌కు అందజేయడంతో.. వర్మ ఇలాంటి కోణం కూడా ఉందా? అని చాలామంది ఆశ్చర్యపోతున్న పరిస్థితి. అయితే పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో అలాంటివి ఎవరైనా క్రియేట్ చేయవచ్చు అనేవారు కూడా లేకపోలేదు.

దానిపై స్పందించారు కానీ..:

దానిపై స్పందించారు కానీ..:

తన విషయంలో గానీ.. తన సినిమాల విషయంలో గానీ ఎవరు జోక్యం చేసుకున్నా స్పందించే వర్మ.. హోమో సెక్సువల్ ఆరోపణల విషయంలో మాత్రం స్పందించకపోవడం గమనార్హం. జయకుమార్ చేసిన కాపీ ఆరోపణలపై వర్మ స్పందించారు తప్పితే.. హోమో సెక్సువల్ ఆరోపణలపై మాత్రం మౌనం వహిస్తున్నారు.

వర్మలో మరో మనిషి.. నన్ను లైంగికంగా వేధించాడు: బాంబు పేల్చిన జయకుమార్

 ఎందుకీ మౌనం..:

ఎందుకీ మౌనం..:

జయకుమార్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం కాబట్టి స్పందించడం అనవసరం అని వర్మ భావిస్తున్నారా?.. లేక దీనిపై స్పందిస్తే తనలోని మరో కోణం బయటపడుతుందని భయపడుతున్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. టీవి చానెల్స్ లో గంటల తరబడి డిబేట్ చేసే వర్మ.. ఈ విషయంపై నోరు మెదపకపోవడం చాలామందికి ఆశ్చర్యాన్నే కలిగిస్తోంది.

'జీఎస్‌టీ'కి పోటెత్తుతున్న ట్రాఫిక్: నేడే విడుదల, ఆ కామెంట్‌తో మరో వివాదంలో వర్మ..

జయకుమార్‌ను తిడుతున్న ఫ్యాన్స్:

జయకుమార్‌ను తిడుతున్న ఫ్యాన్స్:

వర్మ అసలు వ్యక్తిత్వం గురించి తెలియకనే.. చాలామంది ఆయన్ను దేవుడిగా భావిస్తుంటారని జయకుమార్ అంటున్నారు. తాను వర్మను దగ్గరిగా చూసిన వ్యక్తిగా ఆయనలోని వికృత కోణాల్ని చూశానని చెబుతున్నారు. వర్మ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నవాళ్లు ఇప్పుడు తనను బండ బూతులు తిడుతూ మెసేజ్ లు చేస్తున్నారని, వాళ్లెవరికీ ఆయన అసలు నైజం తెలియకపోవడం వల్లే అంతలా ఆరాధిస్తున్నారని అంటున్నారు.

వాడో దొంగ.. ఆఫీసు నుంచి గెంటేశాం, ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్‌గా ఉన్నానంటే: జయకుమార్‌పై ఆర్జీవి

 టాలెంట్ లేదా?.:

టాలెంట్ లేదా?.:

తనకు టాలెంట్ లేదని, ఎన్నో ఛాన్స్ లు ఇచ్చినా నిరూపించలేకపోయాడని వర్మ చేస్తున్న ఆరోపణలను జయకుమార్ తిప్పికొట్టారు. తనకు టాలెంట్ లేకపోతేనే ఇన్నాళ్లు తన టీమ్ లో కొనసాగించారా? అని ప్రశ్నించారు. సర్కార్-3 టైమ్ లో కథ రాసుకోలేక ఆర్జీవి సతమతమయ్యారని, కథ కోసం నన్ను సంప్రదిస్తే వాట్సాప్ లోనే సినాప్సిస్ రాసి పంపించానని చెప్పుకొచ్చారు. అలాంటిది.. ఇప్పుడు తనపై దొంగతనం ఆరోపణలు చేయడం దారుణమన్నారు.

వివాదం చెత్తగా మారుతోందా..:

వివాదం చెత్తగా మారుతోందా..:

మొత్తానికి జయకుమార్ హోమో సెక్సువల్ ఆరోపణలతో ఈ వివాదం కాస్త చెత్త చెత్తగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో వర్మ బాధితులను కూడా బయటకు తీసుకొస్తే మరిన్ని నిజాలు తెలుస్తాయన్న వాదన కూడా వినిపిస్తోంది. వర్మ బాధితులంతా #మీటూవర్మ క్యాంపెయిన్ లో పాల్గొనాలని ఇప్పటికే జయకుమార్ కూడా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

English summary
Jayakumar took the attack to RGV at a personal level. Jayakumar claimed that Ram Gopal Varma is a homosexual, and compared him to Harvey Weinstein in Hollywood. But till now RGV is not responding on this.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu