twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ9 పై మండిపడ్డ రామ్ గోపాల్ వర్మ

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ సంచలనానికి మారుపేరు. సినిమాల్లో అయినా, నిజజీవితంలో అయినా తాను చెయ్యాలనుకున్నది చేసేయడం ఆయన నైజం. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోడు. తెలుగులో 'శివ' లాంటి హిట్ ఇచ్చి, అటుపై బాలీవుడ్ కు వలస వెళ్లిన ఈ ఫైర్ బ్రాండ్ ఏం చేసినా ఓ సంచలనమే. 'షోలే' లాంటి కళాఖండాన్ని రీ-మేక్ చేసి ఎన్నో విమర్శలపాలయ్యాడు. అయినా ఎవరేమన్నా తను చెయ్యాలనుకున్నది, చూపించాలనుకున్నది, చెప్పాలనుకున్నది తన సినిమాల ద్వారా చెప్పేయడం ఆయన నైజం.

    అలాంటి వర్మ తాజా సంచలనం 'రక్తచరిత్ర'. దివంగత తేదేపా ఎమ్మెల్యే పరిటాల రవి జీవితచరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ప్రకటించినప్పటి నుండీ అందరి దృష్టి ఈ సినిమా పైనే వుంది. దీన్ని క్యాష్ చేసుకోవాలని తొలి తెలుగు న్యూస్ ఛానెల్ అంటూ ఊదరగొట్టేస్తున్న 'టివి-9' రాముతో ఓ ఇంటర్యూ నిర్వహించింది. ఈ ఇంటర్యూకి తానని మించిన మేధావి మరొకరు లేరని ఫీలయిపోయే టివీ-9 న్యూస్ రీడర్ రజనీకాంత్ నేతృత్వం వహించారు. చాలా వాడి వేడిగా జరిగిన ఈ ఇంటర్యూలో 'ఇలాంటి సినిమాల ద్వారా ప్రజలకు రాంగ్ మెసేజ్ వెళ్తుంది, అలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారు'?? అన్న ప్రశ్నకు వర్మ తనదైన శైలిలో "నేనెవరి కోసం సినిమాలు తీయడం లేదు. నా కోసం ప్రత్యేకంగా సినిమాకు వచ్చే ప్రేక్షకులని సంతృప్తి పరచడమే నా పని, మిగితా వాళ్లు కూడా వచ్చి నా సినిమాని ఎంజాయ్ చేస్తే అంతకన్నా ఇంకేం కావాలి!! అయినా ఎవరికోసమే నేను మారను, ఆ అవసరం కూడా నాకు లేదు. మెసేలు ఇవ్వడం కూడా నాకు చేత కాదు, కాబట్టి ఇవ్వను, ఇవ్వాల్సిన అవసరం అంత కన్నా లేదు. నచ్చితే సినిమాని చూడండి లేదంటే మానేయండి, నేనేమన్నా సినిమా చూడమని బలవంతం చేసానా" అంటూ తనదైన ట్రేడ్ మార్క్ డైలాగులు విసిరారు.

    సినిమాల్లో మితిమీరిన రక్తపాతం చూపించి దాన్ని క్యాష్ చేసుకోవాలనుకోవడం ఎంత వరకూ సబబు అని అడిగిన మరో పశ్నకు "నా సినిమా నా ఇష్టం. సినమాలు తీయడం నా ప్యాషన్, అయినా సినిమాలు చూడటం వల్లే జనం చెడిపోతున్నారంటే ఎలాగా?? మీ టీవీల్లో కూడా రకరకాల క్రైం ప్రోగ్రాముల్లో చూపించేది కూడా అదేగా" అంటూ మెళిక పెట్టాడు. దీంతో తామెలంటి రక్తపాతాన్ని ప్రోత్సహించడం లేదని సదురు యాంకర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

    ఈ ఇంటర్యూలో ఒకానొక సంధర్భంలో "ఈ టీవీ ఛానెల్ మూసేస్తే, నేను రక్తచరిత్ర ను ఆపేస్తానని" వర్మ బాంబు పేల్చేసరికి ఎప్పుడూ గడగడమని ప్రశ్నలు అడిగే రజనీ గొంతులో వెలగపండు పడినట్టయింది. అయినా "షూటింగ్ జరిగేప్పుడు ఎవరైనా బాంబులేస్తే ఎలాగా??" లాంటి అర్థం లేని, రెచ్చగొట్టే ప్రశ్నలను అడగటం ఒక్క రజనీకే చెల్లింది. గురివింద తన నలుపు ఎరుగదని, తమ ఛానెల్ లో వచ్చే క్రైం ప్రోగ్రామ్స్ గురించి పట్టించుకోక, ఇతరుల పై పడి ఏడవటం ఎందుకు అని ఈ ఇంటర్యూ చూసిన వారు చెప్పుకుంటున్నారు. ఏదిఎలాగున్నా ఇలాంటి వివాదాస్పద ఇంటర్యూలతో టీవీ-9 రేటింగు పెరుగుతుందనేది మాత్రం నిర్వివాదాంశం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X