»   » ప్రభాస్ ఫ్యాన్‌గా మారిన బాలీవుడ్ హీరో.. నాకు చాలా ఇష్టమన్న సూపర్‌స్టార్

ప్రభాస్ ఫ్యాన్‌గా మారిన బాలీవుడ్ హీరో.. నాకు చాలా ఇష్టమన్న సూపర్‌స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి సంచలన విజయం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల జాబితా భారీగా పెరిగిపోతున్నది. అయితే ఈ జాబితాలో సినీ స్టార్లు కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం ప్రభాస్‌కు బాలీవుడ్ స్టార్ ఫ్యాన్‌గా మారిపోయాడు. అతను ఎవరంటే కపూర్ ఖాందాన్ నుంచి వచ్చిన రణ్‌బీర్ కపూర్. విభిన్నమైన పాత్రలతో, వరుస విజయాలతో దూసుకెళ్తున్న రణ్‌బీర్ ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం.

బాహుబలిలో అద్భుతంగా..

బాహుబలిలో అద్భుతంగా..

రణ్‌బీర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాస్ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం కలుగుతున్నది. బాహుబలి చిత్రంలో అద్భుతంగా కనిపించారు. బాహుబలిగా ప్రభాస్ తప్ప మరొకరిని ఊహించుకోలేం. ప్రస్తుతం నేను ప్రభాస్ ఫ్యాన్‌గా మారిపోయాను అని చెప్పారు.

కత్రినా కైఫ్‌తో రణ్‌బీర్ జగ్గా జసూస్

కత్రినా కైఫ్‌తో రణ్‌బీర్ జగ్గా జసూస్

ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ జగ్గా జాసూస్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ జోడిగా నటిస్తున్నది. స్వయంగా నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు డైరెక్షన్ చేశారు. ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమా తర్వాత నిర్మాతగా మరే చిత్రాన్ని నిర్మించబోనని రణ్ బీర్ అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

నేను మంచి నిర్మాతను కాలేను..

నేను మంచి నిర్మాతను కాలేను..

నేను నిర్మాతగా న్యాయం చేకూర్చలేను. ఆర్థిక వ్యవహారాలను చూసుకోవడంలో నేను అంతగా రాణించలేను. సినీ నిర్మాణ బాధ్యతలు నా వల్ల కావు. ఆ నిర్వహణ నాతో కాదు. దర్శకుడు అనురాగ్ బసు చాలా బాధ్యతలు పంచుకోవడంతో నా పని సులభమైంది అని రణ్ బీర్ అన్నారు.

కత్రినాకు యాక్టింగ్ రాదు..

కత్రినాకు యాక్టింగ్ రాదు..

ఇటీవల తనపై కత్రినా చేసిన వ్యాఖ్యలపై రణ్‌బీర్ చాలా ఫన్నీగా స్పందించారు. నేను ఓవర్ యాక్షన్ చేస్తానని కత్రినా చెప్పింది. అది వాస్తవమో కాదో తెలియదు. కానీ కత్రినాకు అసలు యాక్టింగ్ రాదని కత్రినానకు రణ్ బీర్ కౌంటర్ ఇచ్చాడు. చాలా చిత్రాల్లో కత్రినా నటించినట్టు ఎక్కడ కనిపించలేదని చురకలు అంటించారు.

English summary
Actor Ranbir Kapoor has joined the list of admirers of Baahubali’ star Prabhas. Ranbir said: "I have really liked Prabhas. He is amazing in 'Baahubali'." Meanwhile, the Bollywood actor is awaiting the release of Jagga Jasoos’, which will hit the screens on July 14. Ranbir has also co-produced Jagga Jasoos’, helmed by Anurag Basu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu