»   » కథలో దమ్ముంది కాబట్టి క్వాలిటీ విషయంలో రాజీపడలేదు..

కథలో దమ్ముంది కాబట్టి క్వాలిటీ విషయంలో రాజీపడలేదు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

విక్రమ్ వీర్ కథానాయకుడిగా రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'మనసారా" చిత్రం గతవారం విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచీ వస్తోన్న స్పందనను, తొలిచిత్రం అనుభవాలను విక్రమ్ వీర్ శుక్రవారం పత్రికలవారితో వివరిస్తూ-''మొదటి చిత్రంలోనే ఓ చాలెంజింగ్ రోల్ చేసినందుకు ఆనందంగా వుంది. ఆ పాత్రకు నేడు అందరి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. డీ గ్లామర్‌గా, పిరికివానిగా, అమాయకునిగా నటించాలంటే మొదట్లో కొంత భయపడ్డాను. కానీ రవిబాబుపై నమ్మకంతో నటించాను. ఆయన నా నుంచి మంచి నటనను రాబట్టుకొని, ఈ రోజు సినిమా సక్సెస్‌కు కారణమయ్యారు.

ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే చెందుతుంది. కొత్తజంటతో రవిబాబు సినిమా తెరకెక్కించాలనే సన్నాహాల్లో వున్నప్పుడు అనుకోకుండా ఆయన్నీ కలవడం, ఈ చిత్రంలో హీరోగా ఎంపికకావడం అన్నీ చక చకా జరిగి పోయాయి. కలరిపయ్యా-2 అనే మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో కొనసాగే ఈ ప్రేమకథకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ వస్తోంది. కేరళలో ఇప్పటి వరకు ఎవ్వరూ టచ్ చేయని పలు అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ చేశాం"" అన్నారు. కథలో దమ్ముంది కాబట్టి క్వాలిటీ విషయంలో రాజీపడకూడదనే భావంతోనే తొలి సినిమాను తన సొంత బేనర్‌లో నిర్మించామని, తన తండ్రి ప్రకాష్‌బాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు విక్రమ్ వీర్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu