twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పార్లమెంటులో బిల్లు పెట్టి ఇరుక్కుపోయిన బన్నీ విలన్… ఆ విషయంలో దారుణ ట్రోలింగ్!

    |

    అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసు గుర్రం సినిమాలో విలన్ గా నటించిన రవి కిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ తరువాత కూడా తెలుగులో అనేక సినిమాలు చేసిన ఆయన నిజానికి భోజ్ పురిలో ఒక స్టార్ హీరో. ఇక భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎంపీ కూడా అయినా రవి కిషన్ శుక్రవారం జనాభా నియంత్రణపై ప్రైవేట్ సభ్యుల బిల్లును సమర్పించారు. జనాభా నియంత్రణకు ఈ బిల్లు చాలా ముఖ్యమని, అయితే బిల్లు గురించి తనను సోషల్ మీడియాలో నిరంతరం ట్రోల్ చేస్తున్నారని మీడియా ముందు వాపోయారు. జనాభా నియంత్రణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలోనే విశ్వగురువు అవుతామని లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టే ముందు రవికిషన్ అన్నారు.

    జనాభాను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం, జనాభా పెరుగుతున్న తీరు పేలుడు దిశగా సాగుతోందని పేర్కొన్నారు. అయితే రవి కిషన్ కు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. ఈ కారణంగానే బీజేపీ ఎంపీపై ట్రోల్ జరుగుతోంది. ఆయనకు 4 మంది పిల్లలు ఉన్నారని, అయినప్పటికీ జనాభా నియంత్రణపై ఉపన్యాసాలు ఇస్తున్నాడని నెటిజన్లు కామెంట్ చేశారు. ఒక వేళ ఈ చట్టం అమల్లోకి వస్తే రవి కిషన్ తన నలుగురిలో ఇద్దరు పిల్లలను ఎంచుకోవలసి ఉంటుందని రజత్ అనే నెటిజన్ కామెంట్ చేశారు. ప్రతిపాదిత జనాభా నియంత్రణ బిల్లు ప్రకారం ఏ దంపతులు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలకు జన్మనివ్వలేరు.

    Ravi Kishan Brings Private Bill In Parliament And Getting Trolled On Twitter

    ఒక జంటకు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రభుత్వ మినహాయింపులు మొదలైన వాటి ప్రయోజనం ఇవ్వబడదని పేర్కొన్నారు. ఇక పార్లమెంట్‌లో 35 సార్లు ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇంతవరకూ గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రవేశపెట్టిన సోషల్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్‌మెంట్ రిజల్యూషన్ 1969లోని ఆర్టికల్ 22 ఏమి చెబుతోందంటే , ఏ దంపతులకైనా తమకు ఎంతమంది పిల్లలు పుట్టాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉందని పేర్కొంది. అలాగే, పిల్లల సంఖ్యను నియంత్రించడం అనేది రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుంది.

    English summary
    MP Ravi Kishan Brings Population Control Private Bill In Parliament And Getting Trolled On Twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X