»   » బాలకృష్ణ కాదంటే రవితేజ రమ్మన్నాడు

బాలకృష్ణ కాదంటే రవితేజ రమ్మన్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణతో 'భీష్మ' చిత్రాన్ని పూజ కార్యక్రమాలతో ప్రారంభించిన దర్శకుడు రమేష్ వర్మ ఆ ప్రాజెక్టు కాన్సిల్ కావటంతో రవితేజతో చిత్రం కమిట్ అయ్యారు. రవితేజ హీరోగా 'వీర..ది వారియర్' అనే టైటిల్ తో ఈ చిత్రం రానుంది.లేటెస్ట్ గా విడుదలైన సల్మాన్ ఖాన్ వీర..ద వారియర్ కి టైటిల్ లో తప్ప దేనిలోనూ పోలిక ఉండదని చెప్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని టాలీ టు హాలీ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. వారు ఇంతకు మందు అజయ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఆ ఒక్కడు, జగపతిబాబు తో ప్రవరాఖ్యుడు చిత్రాలు రూపొందించారు.దర్శకుడు రమేష్ వర్మ గతంలో తరుణ్ లో ఒక ఊరిలో దర్శకత్వం చేసి ల్యాంగ్ గ్యాప్ తో బెల్లంకొండ నిర్మాతగా రైడ్ చిత్రం చేసారు. భూమిక మల్లెపూవు చిత్రానికి కథ అందించాడు. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా భీష్మ అనే చిత్రాన్ని ప్రారంభించారు కాని కార్య రూపం దాల్చలేదు.అలాగే ఈ వీర చిత్రానికి గాను సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా, కెమెరా శ్యామ్ కె.నాయుడు అందిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ డైలాగులు రాస్తున్నారు. గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu