»   » భరత్ దుర్మరణం: చూడటానికి రాని రవితేజ, అంత్యక్రియలకు కుటుంబం దూరం!

భరత్ దుర్మరణం: చూడటానికి రాని రవితేజ, అంత్యక్రియలకు కుటుంబం దూరం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరో రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే చనిపోయిన తమ్ముడిని చివరి చూపు చూడటానికి రవితేజ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ రాక పోవడం, కనీసం అంత్యక్రియల్లో పాల్గొనక పోవడం చర్చనీయాంశం అయింది.

తమ్ముడు భౌతిక కాయాన్ని చివరి చూపు కూడా చూడలేనని రవితేజ చెప్పారు. భరత్ భౌతికకాయాన్ని చూడడానికి ఆయన తల్లి కూడా ఇష్టపడలేదు. దాంతో కుటుంబసభ్యులు ఎవరూ లేకుండానే భరత్ అంత్యక్రియలు జరిగాయి.

ఆసుపత్రి నుండి స్మశానానికే

ఆసుపత్రి నుండి స్మశానానికే

యాక్సిడెంట్ స్పాట్ నుండి భరత్ భౌతిక కాయాన్ని పోస్టు మార్టం నిమిత్తం మొదట ఉస్మానియాకు తరలించారు. అనంతరం మృత దేహాన్ని ఇంటికి కూడా తరలించకుండా నేరుగా మహాప్రస్తానం స్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

మరో సోదరుడు రఘు మాత్రమే..

మరో సోదరుడు రఘు మాత్రమే..

మహాప్రస్తానంలో జరిగిన అంత్య క్రిల్లో రవితేజ మరో సోదరుడు రఘు, కొందరు స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. చివరి చూపు చూసేందుకు కుటుంబ సభ్యులు ఎందుకు దూరంగా ఉన్నారు అనేది అర్థం కావడం లేదు.

రవితేజ స్పందన

రవితేజ స్పందన

30ఏళ్లుగా తమ్ముడు భరత్‌తో ఉన్న అనుబంధాన్ని రవితేజ గుర్తు చేసుకుంటూ..భౌతిక కాయాన్ని కూడా చూడలేనని అన్నారు. కుటుంబసభ్యులందరూ శోకసంద్రంలో ఉన్నారు. అంత్యక్రియలకు ఎవరూ రాలేకపోతున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలంటూ రవితేజ మీడియాకు, మిత్రులకు చెప్పారు.

భరత్ మరనం

భరత్ మరనం

శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో భరత్ దుర్మరణం చెందారు. వేగంగా ప్రయాణిస్తున్న ఆయన కారు ఆగిఉన్న లారీని ఢీ కొట్టింది. ప్రమాదం జరిగినపుడు కారు 140 కి.మీ వేగంతో ఉండటంతో భరత్ అక్కడికక్కడే మృతిచెందారు.

English summary
Tollywood star Ravi Teja's brother Bharath met with an accident on Saturday at around 10 pm and died on the spot. The accident occurred at Chennamma Hotel near Kotwalguda in Shamsabad and the victim was driving to Gachibowli. Ravi Teja not attending the Bharat Raju funeral.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu