»   » అభిమానికి షాకింగ్ రిప్లై ఇచ్చిన రవితేజ, నిజంగానే చేస్తాడా?

అభిమానికి షాకింగ్ రిప్లై ఇచ్చిన రవితేజ, నిజంగానే చేస్తాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సోషల్ మీడియాకు లేటుగా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్ గా ఉంటూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నాడు రవితేజ. ఏ మాత్రం కాస్త సమయం దొరికినా ... ఫ్యాన్స్ తో చాట్ చేస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నాడు. తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చి అందరిని షాక్ కి గురి చేశాడు. ఇంతకీ ఆ ఫ్యాన్ ఏం అడిగాడు. రవితేజ...ఏం సమాధానం చెప్పాడో చూడండి.

సదరు అభిమాని డైరెక్షన్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అని రవితేజని అడగగా, తప్పక ఉంటుంది.. అది ఎప్పుడు అనేది తెలియదని సమాధానం ఇచ్చాడు .

హీరో గా ఎంట్రీ ఇవ్వక ముందు రవితేజ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎక్స్ పీరియెన్స్ రవితేజ డైరక్టర్ గా మెగా ఫోన్ పట్టుకోవటానికి సరిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉన్న రవితేజ ప్రస్తుతం టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు .

రవితేజ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 'రాజా ది గ్రేట్‌'. రవితేజ ఈ విషయాన్ని తన ట్విటర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ... ప్రారంభోత్సవంలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. అనిల్‌ రావిపూడి, శిరీష్‌, మెహరీన్‌తో ఎగ్జైటింగ్‌ ప్రయాణం ప్రారంభమైందని ట్వీట్‌ చేశారు.దీంతోపాటు చిత్రం ఫస్ట్‌లుక్‌ను షేర్‌ చేస్తూ.. నచ్చిందా అని ప్రశ్నించారు.

Ravi Teja open up on direction

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ర‌వితేజతో భ‌ద్ర సినిమా త‌ర్వాత చేస్తున్న సినిమా రాజాది గ్రేట్‌. అలాగే డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో సుప్రీమ్ త‌ర్వాత చేస్తున్న సినిమా ఇది. ఈ రెండు సినిమాల‌ను దాటి ఈ సినిమా పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంది అన్నారు.

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ర‌వితేజ‌గారితో చేస్తున్న డిప‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజగారు చేయ‌ని విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. అలాగే దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లో రెండో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. ర‌వితేజ‌గారి అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిస్తాం. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియజేస్తాం అన్నారు.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహరీన్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ-లుక్‌ను చిత్ర బృందం విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ, మెహరీన్ కౌర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః దిల్ రాజు, నిర్మాతః శిరీష్‌, క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః అనిల్ రావిపూడి.

English summary
Ravi Teja interacted with his twitter followers yesterday and answered their questions in his style. When one of then twitterati asked about his directorial plans the Kick movie star replied that he has quite a few for direction and will surely helm the mega phone in future.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu