»   » కందికొండ, వదిన నన్ను తొక్కేస్తున్నారు: చక్రి సోదరుడు

కందికొండ, వదిన నన్ను తొక్కేస్తున్నారు: చక్రి సోదరుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు, దివంగత చక్రి మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఆస్తి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా చక్రి సోదరుడు మహిత్ నారాయణ... వదిన శ్రావణిపై ఆరోపణలు చేసారు. సినీ పాటల రచయిత కందికొండ, తన వదిన శ్రావణి తనను కెరీర్లో ఎదగనీయకుండా చేస్తున్నారిని ఆరోపించారు. తనను మీడియానే కాపాడాలని నారాయణ విజ్ణప్తి చేశారు.

ఈ వివాదం నేపథ్యంలో చక్రి భార్య శ్రావణి..... చక్రి తల్లి, సోదరుడు మహిత్ నారాయణ మధ్య వివాదం సాగుతోంది. చక్రి మరణానికి మీరంటే మీరే కారణంటూ అటు చక్రి భార్య, ఇటు చక్రి సోదరుడు, తల్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ వివాదం ఇలా ఉంటే ఇటీవల చక్రి కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం పెద్ద సంచలనమే రేపింది.

Relatives fight over Chakri's property

ఇటీవల మహిత్ నారాయణ..... తన వదిన శ్రావణిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. తన సోదరుడు చక్రికి సంబంధించిన స్టూడియో వదిన శ్రావణి ఆదీనంలో ఉందని, దాన్ని తెరిపించాలని కోరారు. తాను పలు చిత్రాలకు పని చేస్తున్నానని, నా ట్యూన్స్ కొన్ని స్టూడియోలోనే ఉండిపోయాయి, అవి ఇపుడు ఎంతో అవసరం...వెంటనే స్టూడియో తెరిపించాలని ఫిర్యాదు చేసారు.

చక్రి మరణంపై వీడిన మిస్టరీ...
చక్రి మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. చక్రి అంత్య క్రియలు ముగిసిన వెంటనే కుటుంబంలోని విబేధాలు బయట పడ్డాయి. చక్రి సంపాదించిన ఆస్తి గురించి...అతని భార్య ఓ వైపు, తల్లి-తమ్ముడు, ఇతర కుటుంబ సభ్యులు మరో వైపు గొడవ పడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో చక్రిని మీరే చంపారంటే మీరూ చంపారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. విషయం పోలీసుల వరకు వెళ్లింది. ఆయన మరణం వెనక రహస్యాన్ని తేల్చడానికి ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆయనది విష ప్రయోగం కాదు, సహజ మరణమే అని తేల్చారు.

English summary
In less than a month after the sudden death of Tollywood music director Chakradhar alias Chakri, Relatives fight over his property.
Please Wait while comments are loading...