»   » ఆ 100 కోట్ల బడ్జెట్ సినిమా మధ్యలోనే ఆగిపోనుందా..!?

ఆ 100 కోట్ల బడ్జెట్ సినిమా మధ్యలోనే ఆగిపోనుందా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

శాండల్‌వుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌ చిత్రంగా చర్చనీయాంశమైన కలి సినిమా "కలి" ఆగిపోతుందంటూ గాంధీనగర్‌లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నయి. కన్నడ చిత్రపరిశ్రమలో స్టార్‌ హీరోలు శివరాజ్‌కుమార్, సుదీప్‌ హీరోలుగా సుమారు 100కోట్ల భారీ వ్యయంతో "కలి" అనే సినిమా నిర్మిస్తున్నట్లు దర్శకుడు ప్రేమ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.ఒక రకంగా మరో బాహుబలి వంటి మెగా సినిమానే అనుకున్నారంతా.,

అయితే ఏమైందో గానీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కటం అనుమానమే అంటూ కొన్ని వార్తలు బయల్దేరాయి.. కారణం ఏమిటన్నదు ఖచ్చింగా ఎవరికీ తెలియదు గానీ ఈ సినిమా కథ సుదీప్, శివరాజ్‌కుమార్‌లకు నచ్చలేదని కొందర అనుకుంటుండగా, ఇంత భారీ బడ్జెట్‌ పెట్టడానికి నిర్మాతలు వెనకడు వేస్తున్నారని రకరకాల ఊహాగానాలు వినవస్తున్నాయి.

Release date of kannada movie kali not confirmed yet

అయితే దీనిపై దర్శకుడు ప్రేమ్‌ స్పందిస్తూ సినిమా ఆగిపోలేదని 100కోట్ల బడ్జెట్‌ మూవీ కావటంతో ఈ సినిమాను నాలుగు భాషలలో విడుదల చేయాలనుకుంటున్నామనీ., కథ కూడా సిద్ధమైందని, ప్రస్తుతం పేపర్‌ వర్క్స్‌ జరుగుతున్నాయని చెప్పి కాస్త ఊపిరి పోసాడు. అంతే కాకుండా చిత్రంలో గ్రాఫిక్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నందున సమయం ఎక్కువ తీసుకుంటుందని తెలిపారు.శివరాజ్‌కుమార్‌ హీరోగా నటించిన చిత్రాలలో ప్రత్యేకంగా నిలచిన జోగీ (తెలుగులో ప్రభాస్ హీరోగా వచ్చిన యోగీ) సినిమాతో ప్రేమ్‌ శాండల్‌వుడ్‌లో అగ్రశ్రేణి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

కానీ సినిమా బయటికి వచ్చేదాకా అనుమానమే అంటున్నారు శాండల్ వుడ్ జనాలు.. అంత భారీ వ్యయాన్ని ఇప్పటికిప్పుడు నిర్మాతలు భరించలేక పోవటం వల్లనే సినిమా అటకెక్కిందనీ, థియేటర్ దాకా రావటానికి ఇంకో రెండేళ్ళు పట్టొచ్చనీ చెప్పుకుంటున్నారు...

English summary
"Kali" is an action-thriller Kannada movie directed by Prem, Release date not confirmed yet
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu