»   » మోసం చేయడం లేదు.. పెళ్లి చేసుకొంటున్నా.. సహజీవనంపై ఆసక్తి లేదు.. రేణు

మోసం చేయడం లేదు.. పెళ్లి చేసుకొంటున్నా.. సహజీవనంపై ఆసక్తి లేదు.. రేణు

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Renu Desai Strong Warnings To Pawan Kalyan Fans

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ రెండో పెళ్లి వార్తపై మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతున్నది. పవన్‌తో అధికారికంగా విడాకులు పొందిన ఏడేళ్ల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. కొందరు సానుకూలంగా స్పందించగా, మరికొందరు ప్రతికూలంగా స్పందించారు. అ అంశంపై ఇటీవల రేణు ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకొన్నారు.

  పెద్దలు కుదిర్చిన పెళ్లి

  పెద్దలు కుదిర్చిన పెళ్లి

  నాది లవ్ మ్యారేజ్ అసలే కాదు. పెద్దలు కుదిర్చిన పెళ్లి. నా పెళ్లి విషయం చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల అంత ఉత్సాహంగా లేను. జీవితంలో ఎవరిపైనైనా ప్రేమ ఒకేసారి పుడుతుంది. మళ్లీ మళ్లీ ప్రేమలో పడలేం. ఇక ప్రేమ పెళ్లిపై ఆసక్తి పోయింది అని రేణుదేశాయ్ పేర్కొన్నారు.

  నాకు ఎలాంటి బాధలేదు

  నాకు ఎలాంటి బాధలేదు

  పవన్‌తో విడిపోయిన తర్వాత ఒంటరిగానే జీవించాను. ఆరోగ్య సమస్యలు తప్ప మరో బాధ లేదు. నాకు కాబోయే భర్త మంచివారు. ప్రశాంతంగా ఉంటారు. ఇద్దరం వేరే రంగాలకు చెందిన వారం. మా రంగంలో మాకు మంచి ఆదాయం ఉంది అని రేణు చెప్పారు.

  సహజీవనంపై నమ్మకం పోయింది

  సహజీవనంపై నమ్మకం పోయింది

  పెళ్లి ఎందుకు సహజీవనం చేయవచ్చు కదా అని కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కానీ నాకు అలాంటి జీవితంపై నమ్మకం పోయింది. గతంలో సహజీవనం చేశాను. అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా సహజీవనం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం నా చుట్టు ఉన్న పరిస్థితులు వేరు అని రేణు వెల్లడించారు.

  మోసం.. నేరం చేయడం లేదు

  మోసం.. నేరం చేయడం లేదు

  మన సమాజంలో వివాహ బంధానికి గౌరవం ఉంది. పెళ్లి అనేది బలమైన నమ్మకం. అందులో ప్రశాంతత ఉంటుంది. నేను ఎవరినీ మోసం చేయడం లేదు. నేరం చేయడం లేదు. నాకు 37 ఏళ్లు. పెళ్లి చేసుకొంటున్నాను. ఇది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయం. ఎవరూ తీవ్రంగా స్పందించినా పట్టించుకొను అని రేణు దేశాయ్ అభిప్రాయపడ్డారు.

  ట్విట్టర్‌ నుంచి వైదొలిగి

  ట్విట్టర్‌ నుంచి వైదొలిగి

  గత ఆదివారం (జూన్ 24న) రేణు దేశాయ్ నిశ్చితార్థం జరిగింది. రేణు రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో అతిగా స్పందించారు. దాంతో ఆమె ట్విట్టర్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. రేణు కొత్త జీవితాన్ని పెళ్లి చేసుకోవడంపై పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఆమె సుఖ:శాంతులతో జీవితం సాగాలని ఆకాక్షించారు.

  English summary
  Renu Desai gets engaged to a mystery man. Renu Desai decided to announce her engagement by sharing pictures on social media; yet wants to keep her man’s identity a secret. Yes, she got engaged in a private ceremony yesterday with just close friends and family in attendance. While it’s okay to ask for privacy. We don’t understand what’s with not even revealing the name of the man, who she is going to spend the rest of her life with. All that we get to see in the engagement picture is his smile and how happy he is to get one step closer to getting married to Renu.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more