»   » ఐ లవ్... అంటూ పవన్ కళ్యాణ్ చూపులో తీవ్రత గురించి రేణు దేశాయ్!

ఐ లవ్... అంటూ పవన్ కళ్యాణ్ చూపులో తీవ్రత గురించి రేణు దేశాయ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అతనితో విడిపోయిన తర్వాత పూణెలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రేణు దేశాయ్ తన ట్విట్టర్ పేజీలో పవన్ కళ్యాణ్ గురించి పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది.

పెళ్లయితే ప్రేమ చచ్చిపోతుంది: రేణు దేశాయ్ హాట్ టాపిక్, తన జీవితమేనా?

కొందరు పవన్ కళ్యాణ్ అభిమానుల కోరిక మేరకు... తాను స్వయంగా తీసిన పవన్ కళ్యాణ్ ఫేవరెట్ ఫోటోలును పోస్టు చేసారు. 2010లో తాను కొత్తగా కొన్న కానన్ 5డి కెమెరాతో ఈ ఫోటో తీసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఫోటో పోస్టు చేయడం పాటు ఆ ఫోటోలో తనకు ఇష్టమైన అంశాలను వర్ణించారు.

'ఐ లవ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ హిస్ ఐస్/లుక్ ఇన్ దిస్, హున్స్ ఇట్ ఈజ్ మై ఫేవరెట్, ఆల్సో ది స్కిన్ టోన్ ఈజ్ ఒరిజినల్ & నాట్ ఎడిటెడ్ బై మి' అంటూ పోస్టు చేసారు. రేణు దేశాయ్ చేసిన ఆ పోస్టుపై మీరూ ఓ లుక్కేయండి మరి..

పవన్ గురించి

పవన్ గురించి

ప్రేమ వివాహం చేసుకున్న పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రేణుదేశాయ్‌లు విడిపోయి చాలా కాలమే అయ్యింది. అయినప్పటికీ రేణు ట్విట్టర్‌ ద్వారా సందర్భం వచ్చినప్పుడల్లా పవన్‌ గురించి మాట్లాడుతుంటారు.

కెమెరా

కెమెరా

2010లో తాను కేనన్‌ కెమెరా కొనుక్కున్నానని, ఓ రోజు పవన్‌ మౌనంగా కూర్చుని, సూర్యాస్తమయాన్ని చూస్తూ ఆలోచిస్తున్న సమయంలో తానీ ఫొటో తీశానని రేణు ట్వీట్‌ చేశారు.

గతేడాది కూడా

గతేడాది కూడా

గతేడాది కూడా పవన్ ఫోటోస్ రేణు దేశాయ్ తన ట్విట్టర్ ద్వారా పోస్టు చేసింది.

అభిమానుల కోరిక మేరకు

అభిమానుల కోరిక మేరకు

కొందరు అభిమానులు కోరడంతో రేణు దేశాయ్ ఈ ఫోటోలు పోస్టు చేస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
"I love d intensity of his eyes/look in this,hence it's my fav! Also d skin tone is original ¬ edited by me. This was clicked by me in 2010. I had just bought my #5d #Canon & caught him sitting quietly, thinking, staring into the setting sun rays :)" Renu Desai tweeted about Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu