»   » రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కన్నడ చిత్రం?

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కన్నడ చిత్రం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ త్వరలో తొలిసారిగా ఓ కన్నడ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. అందులో సుదీప్ హీరోగా చేయనున్నాడు. 'నిర్ణయ' అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందనుంది. హిందీ,కన్నడ బాషల్లో ఒకేసారి ఈ చిత్రం రూపొందే అవకాశం ఉంది. ఓ విచిత్రమైన ఐడియాతో ధ్రిల్లర్ నేరేషన్ లో ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సుదీప్ కుటుంబ సభ్యులు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇక రణ్, ఫూంక్ చిత్రాలలో సుదీప్ నటించిన సంగతి తెలిసిందే. సుదీప్ ఫెరఫార్మెన్స్ నచ్చిన వర్మ ఈ మేరకు అతని రీజనల్ లాంగ్వేజ్ లో సినిమా చేస్తానని హామీ ఇచ్చాడని చెప్తున్నారు. ప్రస్తుతం సుదీప్...కిచా హుచా అనే చిత్రంలోనూ,మరో పేరుపెట్టని కన్నడ చిత్రంలోనూ చేస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu