»   » పవన్ కు చెందిన ఈ ఫొటోలు ఇప్పుడు వర్మ ఎందుకు పోస్ట్ చేసినట్లు?

పవన్ కు చెందిన ఈ ఫొటోలు ఇప్పుడు వర్మ ఎందుకు పోస్ట్ చేసినట్లు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమను వదిలి ముంబై వెళ్లాను అన్నా వర్మ దృష్టి మొత్తం ఇక్కడ సినిమాలు, రాజకీయాలు, నటులపైనే ఉంది. కొంత కాలంగా పవన్ ప్రస్తావన లేకుండా ట్వీట్లు చేస్తూ వస్తున్న వర్మ.. మళ్లీ జనసేన అధినేత, పవర్ స్టార్ మీదికి దృష్టి మళ్లించినట్లున్నాడు . ఒకపక్క నేనూ పవన్ కళ్యాణ్ కు పిచ్చ అభిమానిని అంటూనే.. ఆయనపై వేయాల్సిన సెటైర్లు అన్నీ వేసేస్తూంటారు వర్మ. మరో ప్రక్క... వర్మ చేసే కామెంట్లకు పవన్ అభిమానులైతే ఆయనపై పవర్ పంచ్ లు విసురుతుంటారు.

  పవన్ కళ్యాణ్ పై ఏదో ఒక కామెంట్ విసరనిదే వర్మకు అస్సలు నిద్రపట్టదని గత కొంతకాలంగా మీడియా రాస్తోంది. దాన్ని నిజం చేయాలనకుంటున్నారో ఏమో కానీ వదిలాసరనుకుంటే మళ్లీ పవన్ ని, ఆయన అభిమానులను కదిపే పోగ్రాం పెట్టుకున్నారు వర్మ. ఈ సారి ఆయన తన మార్షిల్ ఆర్ట్ ఫొటోలను, పవన్ కళ్యాణ్ మార్షిల్ ఆర్ట్ ఫొటోలను కలిపి పోస్ట్ చేసారు.

  RGV tweeted Pawan Kalyan's Marshal arts pics

  పవన్ కూడా కుర్రాడిగా ఉన్నపుడు మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం సంపాదించిన సంగతి తెలిసిందే. ఆయనకి కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. తన సినిమాల్లో ఎన్నోసార్లు మార్షల్ ఆర్ట్స్ విన్యాసాల్ని కూడా ప్రదర్శించారు పవన్. పవన్ కరాటేలో ఎంత పవర్ ఫులో వర్మ షేర్ చేసిన ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కాలును నిటారుగా పైకి లేపాడు పవన్.

  అంతా బాగానే ఉంది కానీ సైలెంట్ గా పవన్ ఊసెత్తకుండా గడుపుతున్న వర్మ..హఠాత్తుగా ఇప్పుడు పవన్ ఫొటోలను ఎందుకు పోస్ట్ చేసినట్లు అనేది ఎవరికీ అర్దం కాలేదు. మళ్లీ పవన్ కి సంభందించిన ట్వీట్ల సీరిస్ మొదలెడతారా..ఇది దేనికి నాంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అంటే పవన్ లాగే నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను అని చెప్పటం ఆయన ఉద్దేశ్యమా అనేది తెలియరాలేదు.

  ఇక రీసెంట్ గా జరిగిన ఓ మీడియా మీట్ లో పవన్ ను వర్మ గురించి అడగ్గా 'అలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు మాట్లాడే సమయం కాదు కాని సభా ముఖం గా నేను ఒక్కటే చెప్పదలచుకున్నాను కాసేపు పైకి లేపుతాడు మరి కాసేపు కిందకి దించుతాడు అలాగే ఆయనకు 50 ఏళ్ళు ఉన్నాయి ఈ మధ్యనే పెళ్ళైన కూతురు ఉంది కాని నేను పొద్దునే పోర్న్ మూవీస్ చూస్తాను అన్న అలాంటి వారి గురించి నాకు మాట్లాడే సమయం లేదు ఆశక్తి లేదు' పవన్ ఆయన గురించి చెప్పడం జరిగింది.

  English summary
  Ram Gopal Varma tweeted Pawan Kalyan's Marshal arts pics. RGV has a cult following even today and he is known to express his opinions without any inhibitions. Recently he has been tweeting heavily about Pawan Kalyan and most of the people thought it was a trick to grab a film with the star.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more