»   » రోబో సినిమాలోని రజనికాంత్ నటనను ఎవరూ అందుకోలేరు..!

రోబో సినిమాలోని రజనికాంత్ నటనను ఎవరూ అందుకోలేరు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu
సుమారు రెండు వందల కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, దర్శకుడు శంకర్ సృష్టించిన అధ్బుతం రోబో. విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ కధానాయికగా రూపోందిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్ర సమర్పకుడు తోట కన్నారావు మాట్లాడుతూ ఇలాంటి అధ్బుతమైన చిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని తన మనోభావాలను వెల్లడించారు.

ఈ సినిమాకు సంబందించి ఓ గ్రాఫిక్ ఎపిసోడ్ మరియు మూడు పాటలను మాత్రమే చూశాను. వండర్ పుల్ గా అనిపించింది. ఇప్పటివరకూ చూసిన రజనీకాంత్ వేరు, ఈ సినిమాలోని రజనికాంత్ వేరు అని అన్నారు. ఈ సినిమాలో ఆయన నటనను అందుకోవడానికి ఎవరూ సరిపోరు. ఇందులో ఆయన నటన ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. హాలీవుడ్ సినిమాను చూస్తున్న అనుభూతిని దర్శకుడు శంకర్ ఈ రోబో సినిమాని రెండు సంవత్సరాలపాటు కష్టపడి తీర్చిదిద్దారన్నారు. ఈ సినిమాకి ఐశ్వర్యరాయ్ గ్లామర్ మరియు రెహామాన్ సంగీతం అదనపు ఆకర్షణలుగా నిలుస్తాయన్నారు. అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రెండు వేలకు పై చిలుకు ధియేటర్లలో విడుదలకాబోతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా, తెలుగులో దాదాపు 800 ధియేటర్లలో విడుదల చేస్తున్నాం అని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu