For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఈగ, అరుంధతి ప్రేరణ, దర్శకుడిగా తృప్తిలేదు : ‘రుద్రమ దేవి’పై గుణశేఖర్

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : అనుష్క ముఖ్య పాత్రలో దర్శకుడు గుణశేఖర్ 'రుద్రమ దేవి' చిత్రానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కాకతీయ వీరనారి 'రాణి రుద్రమ' కథ సినిమా తీయాలని పదేళ్లుగా అనుకుంటున్నాను, అర్జున్ సినిమా తర్వాతే ఈచిత్రం మొదలు కావాల్సి ఉండగా అనేక కారణాలతో వాయిదా పడిందని తెలిపారు.

  అరుంధతి చిత్రం తర్వాత అనుష్కను హీరోయిన్ గా పెట్టాలని డిసైడ్ అయ్యాను. అరుంధతి, ఈగ చిత్రాలను ప్రేక్షకులు అపురూపంగా ఆదరించడం వలన మంచి సినిమా తీస్తే తప్పకుండా మన ఆడియన్స్ బ్రహ్మరథం పడతారనే నమ్మకం ఏర్పడి ఇంతటి భారీ ప్రాజెక్టును సొంతగా నిర్మించడానికి రంగంలోకి దిగాను అని తెలిపారు. దర్శకుడిగా నాకు ఇప్పటి వరకు తృప్తి లేదు. ఈ చిత్రం ద్వారా నేను సంతృప్తి చెందుతాను అనే నమ్మకం ఉంది. స్క్రిప్టు పక్కాగా రెడీ అయింది. సెట్స్ కూడా రెడీ అవుతున్నాయి అని గుణశేఖర్ చెప్పుకొచ్చారు.

  2013 ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని గుణశేఖర్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చే వరకు అంతటి దేశ భక్తుడి గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. ఈచిత్రం తర్వాత రుద్రమ దేవి ఘనత గురించి అందరూ చెప్పుకుంటారు అనే నమ్మకం వ్యక్తం చేసారు. భారతదేశ చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా రుద్రమదేవి చిత్రాన్ని నిర్మించబోతున్నాం అని తెలిపారు.

  రాణి రుద్రమ దేవి ప్రెస్ మీట్ సందర్భంగా.....గుణశేఖర్ నీలం తుఫాను బాధితుల కోసం తన వంతు సాయంగా రూ. 5 లక్షల విరాళం అందజేసారు. ఈ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి పంపనున్నట్లు తెలిపారు.

  ఇండియాలో తొలి స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా రూపొందుతున్న ఈచిత్రం ద్వారా దర్శకుడు గుణశేఖర్ నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఈచిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్ : పద్మశ్రీ తోట తరణి, సినిమాటోగ్రఫీ : అజయ్ విన్సెంట్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : కమల్ కన్నన్(ప్రసాద్ ఇఎఫ్ఎక్స్), ఎడిటింగ్ : శ్రీకర ప్రసాద్, స్క్రిప్టు అసోసియేట్ : తోట ప్రసాద్, స్టోరీ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ : ముదిగొండ శివప్రసాద్, కాస్టూమ్ డిజైనర్ : నీతా లుల్ల(జోధా అక్భర్ ఫేం), మధుబాబు, ఎం.బి.ఎస్.ప్రసాద్, కథ-స్ర్కీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం : గుణశేఖర్.

  English summary
  Rudrama Devi is going to be the highest budget movie in the career of Anushka Shetty. Its first look carry a line that reads, "India's first historical stereoscopic 3D film." It is said to be a dream project for Gunasekhar, who has planned to use the prevailing hi-technology to make in a big hit. Maestro Ilayaraja will compose music for this bilingual film, which will be simultaneously made in Telugu and Tamil. Art director Thota Tharani is likely to be roped in for creating lavish sets
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more