రామ్‌తోనా? నితిన్‌తోనా? క్లారిటీ ఇచ్చిన అజయ్ భూపతి

RX 100 భారీ సక్సెస్‌తో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన దర్శకుడు అజయ్ భూపతి తన రెండో చిత్రంపై వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చాడు. RX 100 చిత్రం తర్వాత అజయ్ భూపతికి కేవలం టాలీవుడ్ నుంచే కాకుండా తమిళ పరిశ్రమ నుంచి కూడా భారీగా ఆఫర్లు వస్తున్నాయనే వార్త మీడియాలో నానుతున్నాయి.

తన రెండో చిత్రం రామ్‌తో చేస్తారనే వార్త ప్రధానంగా వినిపించింది. రామ్‌తో చేయాలనుకొనే మల్టీస్టారర్ కథను మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్‌కు కూడా వినిపించాడనే వార్త వెలుగు చూసింది.

RX 100 director Ajay Bhupati given clarity on his next project

ఇదిలా ఉండగా, మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను పక్కన పడేసి నితిన్ కోసం ఓ సినిమాను అంగీకరించాడు. ఆ సినిమా పనిలోనే మునిగి ఉన్నాడనే మాట కూడా మీడియాలో వినిపించింది. ఇలా పలు రకాల వార్తలు మీడియాలో రావడంతో అజయ్ భూపతి స్పందించారు.

నా రెండో సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్‌పై ఉన్నాను. ఓ నెలలో సినిమా పూర్తవుతుంది. అప్పుడే అన్ని వివరాలు వెల్లడిస్తాను. అప్పటి వరకు ఎలాంటి వార్తలను, రూమర్లను నమ్మకండి. స్వయంగా నేనే మీడియాకు అన్ని వివరాలు వెల్లడిస్తాను అని అజయ్ భూపతి వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X