»   » మెగా హీరో ప్రపోజ్ చేస్తే.. "సారీ..! నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు" అనేసింది

మెగా హీరో ప్రపోజ్ చేస్తే.. "సారీ..! నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు" అనేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాయిధరమ్‌ తేజ్‌ మెగా ఫ్యామిలీలో ఇప్పుడొక లేటెస్ట్ క్రేజ్ మనోడు సినిమాల్లోనే కాదు గాసిప్పుల్లో కూడా బాగానే నానుతున్నాడు. టాలీవుడ్ లో ఏ హీరోకీ లేనన్ని లవ్ ట్రాక్ రూమర్లు సాయి ధరమ్ మీదే వస్తున్నాయి. వచ్చిన ఈ కొద్దిరోజుల్లోనే రకుల్ ప్రీత్, రెజీనాలతో ముడిపడి మరీ జోరుగా వినిపించింది సాయి ధరం తేజ్ పేరు. అయితే అందులో ఎంత నిజముందో లేదో అనుకుంటామేమోనై కబోలు తన చిలిపి చేష్టలని తానే చెప్పుకుంటున్నాడు ఈ మెగా చిన్నోడు.

ఆ పాత లవ్ స్టోరీలే నిజమో కాదో తెలీక తలబద్దలు కొట్టుకుంటున్న జనాలకి మూడో క్రష్ గురించి కూడా చెప్పి మరో షాక్ ఇచ్చాడు. విన్నర్ ప్రమోషన్ కోసమో నిజమో గానీ తను ఓ హీరోయిన్‌కు డైరెక్ట్‌గా లవ్‌ ప్రపోజ్‌ చేశానని, కానీ, ఆమె తన ప్రేమను రిజెక్ట్‌ చేసిందని చెప్పాడు. అదీ రకుల్ తో ప్రేమ నిజమే నా అని అడిగిన ప్రశ్నకి సమాధానం దాటేస్తూ ఈ కొత్త కథ చెప్పేసాడు.

Sai Dharam Tej Love on Larissa Bonesi

అయితే ఇంత ప్రేమతో మనోడు ప్రపోజ్ చేసినా పట్టించుకోకుండా సింపుల్ గా నోచెప్పిందట దానికి కారణం ఆ హీరోయిన్‌కు అప్పటికే ఓ బాయ్‌ఫ్రెండ్‌ ఉండడమేనట. అంతే కదా ఆల్రెడీ ఎవరో కర్చీఫ్ వేసేసారు. ఇంతకీ అంత పెద్ద అందగత్తె ఎవరు అనే కదా మీ డౌటు. ఆ హీరోయిన్‌ ఎవరో కాదు..

సాయిధరమ్‌తో 'తిక్క' సినిమాలో నటించిన బ్రెజిల్‌ భామ లారిసా బొనేసి. లారిసా అలా చెప్పడంతో మనోడు చాలా డిస్సప్పాయింట్‌ అయ్యాడట. రెజీనా, రకుల్‌ ప్రీత్‌ల గురించి చెప్పమంటే సాయిధరమ్‌.. బ్రెజిల్‌లో ఉన్న లారిసా గురించి చెప్పాడన్నమాట. ఇంతకీ ఇదంతా నిజమేనా లేక అసలువిషయ దాటేయటానికి చెప్పాడో గానీ విన్నవాళ్ళు మాత్రం ఇంకా పాత లవ్ట్రాక్ లమీదే అనుమానం గా ఉన్నారు. కొత్త కథని ఎవ్వరూ పట్టించుకోలేదు మరి.

English summary
While promoting 'Winner', Tej disclosed he had a crush on his 'Tikka' Co-Star Larissa Bonesi and even proposed to her. To his shock, The Brazilian Beauty informed him that she already have a Boyfriend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu