»   » ఆదిని టాలీ వుడ్ నుంచి పక్కకి తప్పిస్తున్న సాయికుమార్..!? ఎందుకని??

ఆదిని టాలీ వుడ్ నుంచి పక్కకి తప్పిస్తున్న సాయికుమార్..!? ఎందుకని??

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోగా నిలడటానికి చాలా కష్టపడుతున్నాడు ఆది. సాయి కుమార్ తనయుడుగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఈ యువ హీరో ఆరంభంలో చేసిన ప్రేమకావాలి, లవ్లీ లాంటి సినిమాలు పర్వాలేదనిపించాయి కానీ.. ఆ తర్వాత అన్ని సినిమాలూ చేదు అనుభవాన్నే మిగిల్చాయి. ఈ మధ్యే "గరం" అనే సినిమాను సాయికుమార్ సొంతంగా ప్రొడ్యూస్ చేశాడు కూడా.

కానీ అది కూడా బాక్సాఫీస్ దగ్గర కుదేలయ్యింది.. ఇప్పుడు ఆది ఆశలన్నీ "చుట్టాలబ్బాయి" మీదే ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితేనే ఆది మళ్ళీ ఇంకో ప్రయత్నం చేయటానికి ధైర్యం వస్తుంది లేదంటే ఆది కెరీర్ ఇంకా కష్టాల్లో పడ్దట్టే. అందులోనూ ఆరెడేళ్ళుగా ప్రయత్నిస్తున్న ఆదికి ఇప్పుడు వచ్చిన కొత్త హీరోలనుంచి తీవ్రమైన పోటీ ఉంది. ఈ నేపథ్యం లో చుట్టాలబ్బాయి ఎలాంటి ఫలితాన్నిస్తుందో కానీ.. ఇక లాభం లేదని తన కొడుకుని తనకు బాగా కలిసొచ్చిన శాండిల్ వుడ్ లోనే పరిచయం చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడట సాయికుమార్.

adi

సాయి కుమార్ కి కన్నడ లో మాంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. "పోలీస్ స్టోరీ"తో అక్కడ స్టార్ హీరోగా ఎదిగిన సాయికుమార్. అదె స్టామినా తో ఆయన తమ్ముడు రవిశంకర్ కూడా అక్కడ నటుడిగా మారి అవకాశాలని అందుకుని దండుపాళ్యం వంటి సినిమాల్లో చేస్తున్నాడు.

సాయి కుమార్ కూడా ఇప్పటికీ అక్కడి సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలే పోషిస్తున్నాడు. తనకున్న ఫాలోయింగ్‌ను ఉపయోగించుకుని తన కొడుకుని కన్నడలో హీరోగా లాంచ్ చేయాలనుకుంటున్నాడు సాయికుమార్. ఇందుకోసం ఓ తెలుగు సూపర్ హిట్ మూవీని రీమేక్ చేయడానికి నిర్ణయించుకున్నాడు.

రెండేళ్ల కిందట తెలుగులో నిఖిల్ హీరోగా వచ్చి హిట్ అయిన "కార్తికేయ" రీమేక్‌తో ఆదిని కన్నడలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడట సాయికుమార్. ఈ సినిమాకి నిర్మాత కూడా తనే అట. అయితే ఇంకా ఈ సినిమా చర్చల దశలోనే ఉంది. దర్శకుడెవరో ఇంకా తేలలేదు. మరి ఆది.. తండ్రి తరహాలోనే కన్నడలో హీరోగా నిలదొక్కుకుంటాడేమో చూడాలి.

English summary
Sai Kumar wants to introduce his son in Kannada through the remake film of Karthikeya Telugu film. Karthikeya film got fame to its director Chandu Mondeti and its hero Nikhil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X