»   » ఖైదీ, శాతకర్ణి.... వార్ వన్ సైడ్ లాంటివి నమ్మను!

ఖైదీ, శాతకర్ణి.... వార్ వన్ సైడ్ లాంటివి నమ్మను!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ఎన్నడూలేనంత ఆసక్తి నెలకొంది. అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ తమ కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన సినిమాలు విడుదలకు సిద్ధం అవ్వడం.

చిరంజీవి నటించిన 150వ సినిమా, బాలయ్య నటించిన 100వ సినిమా ఈ సారి సంక్రాంతి రేసులో ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో సంక్రాంతి విన్నర్ ఎవరు? అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక మెగా, నందమూరి అభిమానులు ఎవరికి సంక్రాంతి మాది అంటే మాదే అంటూ... తమ తమ సినిమాలపై పూర్తి నమ్మకంతో ఉన్నారు.


అయితే ఈ రెండు చిత్రాలకు పని చేసిన ప్రముఖ మాటల రచయిత బుర్రా సాయిహాధవ్ ఈ పరిణామాలపై తనదైన రీతిలో స్పందించారు.


వార్ వన్ సైడ్

వార్ వన్ సైడ్

వార్ వ‌న్ సైడ్ అయ్యింది...వంటి మాట‌ల‌ను నేను ప‌ట్టించుకోను. సినిమాను ఒక వ్య‌క్తిగా చూడ‌కూడ‌దు. ఎందుకంటే సినిమా ఒక వ్య‌క్తి కాదు. వ్య‌వ‌స్థ‌. కొన్ని వంద‌ల మంది క‌ష్టం ఉంటుంది. కాబ‌ట్టి నేను ప‌నిచేసినా, చేయ‌క‌పోయినా అన్ని సినిమాలు బాగా ఆడాలి. నిర్మాత బాగుంటే ఇండ‌స్ట్రీ బావుంటుంది అన్నారు సాయి మాధవ్.


గొప్పగా ఉంది

గొప్పగా ఉంది

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణితో పాటు ఖైదీ నంబ‌ర్ 150 సినిమాకు కూడా కొన్ని డైలాగ్స్ నేను రాశాను. ఇప్పుడు రెండు సినిమాలు సంక్రాంతికి విడుద‌ల కానున్నాయి. ఈ రెండు సినిమాలు ప్రెస్టీజియ‌స్ మూవీస్ కావ‌డం ఇంకా గొప్ప‌గా ఉంద అని సాయి మాధవ్ తెలిపారు.


శాతకర్ణితో నా దుగ్ద తీరింది

శాతకర్ణితో నా దుగ్ద తీరింది

మొద‌టి సినిమా కృష్ణం వందే జ‌గద్గుర‌మ్ సినిమా చేసిన‌ప్పుడు ఎలా ఫీలై వ‌ర్క్ చేశానో ఈ సినిమాకు కూడా అలాగే వ‌ర్క్ చేశాను. శాతకర్ణి లాంటి సినిమాలకు ప‌నిచేయాల‌నే దుగ్ధ అంద‌రికీ ఉంటుంది. కానీ అవ‌కాశం రాదు. నాకు అవకాశం వ‌చ్చింది. నేను రాసిన డైలాగ్స్‌కు ఇంత మంచి స్పంద‌న రావ‌డం చాలా హ్యాపీగా ఉంటుంది అన్నారు సాయి మాధవ్.


బాలయ్యకు నచ్చుతాయో లేదో అనుకున్నా

బాలయ్యకు నచ్చుతాయో లేదో అనుకున్నా

99 సినిమాలు చేసిన అనుభవం బాల‌కృష్ణ‌ గారిది. ఎందరో గొప్ప రైటర్స్ రాసిన డైలాగులు చెప్పని వారు. ఆయనకు నా డైలాగ్స్ న‌చ్చుతాయో లేదో, ఏమంటారోన‌ని ఫ‌స్ట్ రోజు భ‌య‌ప‌డ్డాను...కానీ ఆయనకు బాగా నచ్చాయి అన్నారు సాయి మాధవ్.


English summary
Tollywood writer Sai Madhav Burra abot Khaidi ni 150 and GPSK. Check out details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu