»   »  హిందీ గబ్బర్ సింగ్, దబాంగ్ 3: ఈ సారి ప్రభుదేవా

హిందీ గబ్బర్ సింగ్, దబాంగ్ 3: ఈ సారి ప్రభుదేవా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ ఖాన్ త్ర‌యంలో ఒక‌డైన స్టార్‌ హీరో స‌ల్మాన్ ఖాన్ కొన్నేళ్లుగా అమీర్‌ ఖాన్‌తో అన్నివిధాలుగా పోటీప‌డుతూ దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే.. కొంత‌కాలం క్రితం స‌ల్మాన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 'దబాంగ్‌', 'దబాంగ్‌ 2′ చిత్రాలు ఘ‌న విజ‌యం సాధించాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

దబాంగ్ 3

దబాంగ్ 3

‘దబాంగ్ 3′ మూవీకి కొరియోగ్ర‌ఫ‌ర్‌నుంచి ద‌ర్శ‌కుడిగా మారి సక్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కుడిగానూ పేరు తెచ్చుకున్న‌ ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నారని చిత్రవర్గాల సమాచారం. సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ నిర్మాతగా వ్యవహరించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

ప్రభుదేవా

ప్రభుదేవా

అయితే మొదటి రెండు భాగాలకు అర్భాజ్‌ దర్శకత్వం వహించగా, ఇప్పుడు మూడో పార్ట్‌కు మాత్రం ప్రభుదేవా ఆ బాధ్యతలు తీసుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగా, త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇందులో హీరోయిన్‌గా అమీ జాక్సన్‌ను సెలక్ట్‌ చేసినట్లు సమాచారం.

టైగర్ జిందా హై

టైగర్ జిందా హై

ఇందులో కథానాయికగా బ్రిటిష్ బ్యూటీ ఎమీ జాక్సన్ ను తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం సల్మాన్ 'టైగర్ జిందా హై' చిత్రాన్ని చేస్తున్నాడు. ఇది పూర్తవగానే 'దబాంగ్ 3' మొదలవుతుందట. బ్రిటిష్ బ్యూటీ ఎమీ‌జాక్సన్‌తో సల్మాన్‌కి ఎఫైర్ వుందన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీలో సినిమాలు చేసిన ఈ అమ్మడు, ఇప్పటికీ హీరోయిన్‌గా సరైన బ్రేక్ రాలేదు.

వాంటెడ్‌-2

వాంటెడ్‌-2

ప్రస్తుతం హోప్స్ అన్నీ '2.0' మీదే పెట్టుకుంది. సల్మాన్ కూడా దబాంగ్ 3‌తో ఈమెకి లిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట. కొన్నాళ్ళ కిందట ‘దబాంగ్‌-3' చిత్రాన్ని పక్కన పెట్టి ‘వాంటెడ్‌-2'కు సల్మాన్‌ ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అర్భాజ్‌ఖాన్‌ సల్మాన్‌ఖాన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడని తెలిసింది. ఆ తర్వాత ప్రభుదేవా.. సల్మాన్‌ కాంబినేషన్‌లో ‘వాంటెడ్‌-2' తెరకెక్కట్లేదని స్పష్టం చేశారు.

English summary
Prabhudeva is all set to direct the upcoming Salman Khan starrer Dabangg 3. Produced by Salman Khan's brother and actor Arbaaz Khan
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu