»   » రారండోయ్ "పెళ్ళి" వేడుక చూద్దాం...!: సమంతా చైతూ పెళ్ళి అక్టోబర్ 6 న

రారండోయ్ "పెళ్ళి" వేడుక చూద్దాం...!: సమంతా చైతూ పెళ్ళి అక్టోబర్ 6 న

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాదాపు ఏడేళ్లుగా స్నేహితులుగా మెలుగుతున్న అక్కినేని నాగచైతన్య, సమంత త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.నాగచైతన్య ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో తమ వివాహం అక్టోబర్ నెలలో ఉంటుందని, డేట్ ఇంకా అనుకోలేదని చెప్పాడు.

అక్టోబర్ 6న

అక్టోబర్ 6న

అయితే సమంత నాగచైతన్య ల పెళ్లి అక్టోబర్ 6న జరగునుందనే వార్త వైరల్ అయ్యింది.పెళ్లి అక్టోబర్ లో చేసుకోవడం ఖాయం అది కూడా హిందూ , క్రిస్టియన్ ల సంప్రదాయాల్లో చేసుకోవడం ఖాయం అయితే డేట్ ఎప్పుడనేది త్వరలోనే తెలియజేస్తాం అని స్పష్టం చేసాడు చైతూ.


రెండుసార్లు పెళ్లి జరుగుతుంది

రెండుసార్లు పెళ్లి జరుగుతుంది

దీన్ని అధికారికంగా ప్రకటించకపోయినా అక్టోబర్ లోనే పెళ్లి అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ప్రమోషనలో బిజీగా ఉన్నాడు.పెళ్లి ఎక్కడ జరుగుతుందనేది తెలియదు కానీ, రెండుసార్లు తమ పెళ్లి జరుగుతుందని చెప్పాడు.


బిజీబిజీగా గడిపేస్తున్నారు

బిజీబిజీగా గడిపేస్తున్నారు

సమంత నాగ చైతన్యా వివాహంపై పెద్ద చర్చ జరుగుతోంది. నిశ్చితార్థం ముగిసిన అనంతరం వివాహంపై ఇద్దరూ ఎలాంటి ప్రకటన చేయలేదు సరికదా, ఎవరి సినిమా షూటింగుల్లో వారు బిజీబిజీగా గడిపేస్తున్నారు. నిశ్చితార్థమైన తొలినాళ్లలో సమంత చైతూ గురించిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఆసక్తి రేపింది.


అఖిల్ వివాహం రద్దు కావడంతో

అఖిల్ వివాహం రద్దు కావడంతో

తరువాత ఇద్దరూ మౌనంగా తమ పనిలో తాము నిమగ్నమైపోయారు. ఇప్పటికే అఖిల్ వివాహం రద్దు కావడంతో, అక్కినేని ఫ్యామిలీ అభిమానుల్లో తమ అభిమాన జంట వివాహం ఎప్పుడు? ఎక్కడ? జరుగుతుందా? వంటి అనుమానాలు నిండిపోయాయి. ఈ అనుమానాలన్నిటికీ మొత్తానికి ఇలా తెరదించేసాడు చైతన్య.


సహజీవనం చేస్తున్నారు

సహజీవనం చేస్తున్నారు

గతకొంత కాలంగా చైతూ - సమంత లు ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే . పైగా వివాహ నిశ్చితార్దానికి ముందు నుండే సహజీవనం చేస్తున్నారు కూడా . ఇద్దరి పెళ్ళికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో అక్టోబర్ లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు . ఇక చైతూ విషయానికి వస్తే ఈ నెల 26న రారండోయ్ వేడుక చూద్దాం సినిమా రిలీజ్ కానుంది.


రా రండోయ్ వేడుక చూద్దాం

రా రండోయ్ వేడుక చూద్దాం

ఇండస్ట్రీ వారితో పాటు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ అందుబాటులో ఉండేలా.. హైదరాబాద్ లోనే వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట.... ఇక నాగచైతన్య హీరోగా కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన "రా రండోయ్ వేడుక చూద్దాం" మే-19న విడుదల కాబోతోంది.... సో ఈ ఏడాది నాగచైతన్య రెండు వేడుకలు చూపించబోతున్నాడన్నమాట... ఒకటి ఆన్ స్క్రీన్ వేడుకయితే.. మరొకటి ఆఫ్ స్క్రీన్ పెళ్లి వేడుక....English summary
Looks like Samantha and Naga Chaitanya have finalised their wedding date. The couple, who got engaged earlier this year, will get married on October 6.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu