»   » ఆయనకు థ్యాంక్స్‌,కంగ్రాట్స్‌: సమంత

ఆయనకు థ్యాంక్స్‌,కంగ్రాట్స్‌: సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాకు అవకాశం ఇచ్చింది, తెర మీద అందంగా చూపించింది గౌతమ్‌ మీనన్‌తోనే కదా. అందుకే ఈ నంది కూడా ఆయనకే దక్కుతుంది. ఉత్తమ స్క్రీన్‌ ప్లే రచయితగా ఆయన కూడా నంది అందుకోబోతున్నారు. అందుకే ఒక థ్యాంక్స్‌, ఒక కంగ్రాట్స్‌ చెప్పేశా అంటోంది నవ్వుతూ సమంత. ఆమె నటించిన 'ఏ మాయ చేసావె'లో జెస్సీ పాత్రకు గానూ నంది ప్రత్యేక జ్యూరీ అవార్డునీ సొంతం చేసుకొంది.ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఇలా స్పందించింది.అలాగే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు నన్ను గుర్తిస్తే చాలు అనుకొన్నాను. కానీ హీరోయిన్ గా నా స్థానాన్ని పదిలం చేశారు. ఇప్పుడీ నందీ అవార్డు. ఒక సినిమా... రెండు వరాలు అంటే ఇదే అంటూ ఆనందంగా చెప్తోంది.

ఇక ఈ అవార్డు వస్తుందని తాను ఊహించలేదంటూ... మరీ అన్ని ఆశల్లేవు. ప్రతి రోజూ ఈ సన్నివేశం ఎలా చేయాలి? సెట్లో ఎలా నడుచుకోవాలి? ఇలాగే ఆలోచించేదాన్ని. తెర మీద చూసుకొన్న తరవాత, 'హమ్మయ్య... పాసైపోయా' అని వూపిరి పీల్చుకొన్నాను. అంతకు మించి మరే ఆలోచనా ఉండేది కాదు. ఏ మాయ చేసావె విడుదల అయిన తరవాత కొన్ని సంస్థలు అందించిన అవార్డులు తీసుకొన్నాను. అప్పుడు కూడా నంది ఆలోచన రాలేదు అంది. ఇక హీరోయిన్స్ మధ్య పోటీ గురించి చెప్తూ.. పోటీ ఎక్కడైనా ఉంటుంది. అయితే ఆ పాత్ర నాకొస్తే ఎంత బాగుండును అనుకొనేంత వరకే. అంతేగానీ ఒకరి దగ్గర నుంచి బలవంతంగా లాక్కోలేం కదా అంది.

English summary
Samantha, who enthralled the Tollywood audiences as Jessi in Ye Maya Chesave, is elated with the Nandi Special Jury Award from the AP government.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu