»   » 'బృందావనం'లో నా పాత్ర ఏమిటంటే...సమంత

'బృందావనం'లో నా పాత్ర ఏమిటంటే...సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'బృందావనం' చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఏ మాయ చేసావె' చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ 'బృందావనం'లో తన పాత్ర గురించి చెబుతోంది. ఆమె మాటల్లోనే...'బృందావనం' చిత్రంలో నా పాత్ర పేరు ఇందు. కాలేజీలో చదివే అమ్మాయి. ఆధునికంగా ఉంటాను. డ్యాన్సులు బాగా చేస్తానని నా ఫ్రెండ్స్‌ అంటారు. మొదట్లో చిన్నగా ఉన్నా తర్వాత అదే కీలకంగా మారుతుంది. అలాగే 'ఏ మాయ చేసావె' లోని జెస్సీ పాత్రకి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. మిగిలింది సస్పెన్స్‌ అని ఊరిస్తోంది. ఇక తారక్‌తో డ్యాన్సులు చేయబోతున్నానంటే కాస్త టెన్షన్‌గానే ఉందంటోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu