»   » సత్యం రాజమలింగరాజు కోడలు నటిగా తెరంగ్రేటం

సత్యం రాజమలింగరాజు కోడలు నటిగా తెరంగ్రేటం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘కాల్ హెల్త్' పేరుతో ఇటీవలే మెడికల్ సర్వీసెస్ లాంచ్ చేసిన సంధ్య త్వరలో నటిగా తెరపై కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సంధ్య మరెవరె కాదు.... సత్యం రామలింగరాజుకి కోడలు, రామ్ కో సిస్టమ్స్ ఫౌండర్ వెంకట్రామరాజు కూతురు. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న సినిమాలో ఆమె నటిస్తోందని తెలుస్తోంది.

స్వతహాగా కూచిపూడి క్లాసికల్ డాన్సర్ అయిన సంధ్య....ఈ సినిమాలోనూ క్లాసికల్ డాన్సర్ పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది. తనకు ఎంతో ఇష్టమైన క్లాసికల్ డాన్స్ ప్రదర్శించే అవకాశం రావడం వల్లనే ఆమె ఈ సినిమాలో ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె నటిస్తున్న సినిమా వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sandhya Raju turns actress

ఆమె ఇటీవల లాంచ్ చేసిన ‘కాల్ హెల్త్' సర్వీసెస్ వివరాల్లెకి వెళితే...
విదేశాల్లో సెటిలైన ఎన్ఆర్ఐలు... లేదా అక్కడ ఉద్యోగం చేస్తున్న వారు ఇండియాలో ఉన్న తమ తల్లిదండ్రులకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే వారు ఇండియాకి వచ్చి వైద్యం చేయించడం అంటే అంత సులువు అయ్యే పరిస్థితి కాదు. కానీ ఇక్కడున్న తల్లిదండ్రులు సేఫ్‌గా ఉండాలనే భావన వారిలో ఉంది. ప్రధానంగా ఇలాంటి వారిని ఉద్దేశించి కాల్ హెల్త్ పేరిట కొత్త వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సత్యం రామలింగ రాజు కోడలు సంధ్యా రాజు కాల్ హెల్త్ సంస్థ ప్రారంభించాలని నిర్ణయించింది.

రామలింగరాజు కోడలు సంధ్యారాజు ప్రమోటర్ గా ‘కాల్ హెల్త్' అనే సంస్థ పురుడుపోసుకుంది. ఈఎంఆర్ఐ -108లో అత్యున్నత స్థానంలో పనిచేసిన సుధాకర్ సీవోవోగా, టెక్ మహీంద్రాలో కీలక పొజిషన్‌లో పనిచేసిన హరి సీఈఓగా ఇటీవలే రంగ ప్రవేశం చేస్తున్న ‘కాల్ హెల్త్' ప్రధాన లక్ష్యం రోగులకు ఇంటి వద్దే చికిత్స అందించడమేనట.

English summary
Sandhya Raju, the daughter-in-law of Satyam Ramalinga Raju and daughter of Ramco Systems founder Venkatrama Raju, is now brushing up her creative instincts and turning an actress. The lady will show her acting skills in a yet to be released film which is ready for its release.
Please Wait while comments are loading...