»   » 51 ఏళ్ళ వయస్సులో కవలలకు తండ్రి అయిన స్టార్ హీరో

51 ఏళ్ళ వయస్సులో కవలలకు తండ్రి అయిన స్టార్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

లేటు వయస్సులో బాలీవుడ్ హీరో సంజయ్ ‌దత్ మూడవ భార్యకు ముచ్చటగా ఒకే కాన్పులో ఇద్దరు కవలలు జన్మించారు. మాన్యతాదత్ గురువారం మధ్యాహ్నం (32) ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో పండంటి కవలలకు జన్మనిచ్చారు. సంజయ్ దంపతులకు ఈ మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల మధ్యలో మగపిల్ల, ఆడపిల్లకు పుట్టారు. మాన్యత ఆరోగ్య పరిస్థితి బాగున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాన్పు సమయంలో సంజయ్‌ కూడా అక్కడే ఉన్నట్లు చెప్పారు. 51 ఏళ్ల సంజయ్ ‌కు మాన్యత మూడో భార్య. మొదటి భార్య కుమార్తె త్రిషాలా అమెరికాలో చదువుకుంటోంది. న్యూయార్క్‌ కాలేజిలో త్రిష ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. కవల పిల్లల తండ్రయిన సంజయ్ ‌కు ఎక్కడెక్కడనుంచో శుభాకాంక్షల సందేశాలు కంటిన్యూగా వస్తున్నాయి. ఈ విషయం తెలిసి బాలీవుడ్ తారలు శిల్పాశెట్టి, అమీషాపటేల్ ‌లు ట్విట్టర్ ‌లో శుభాకాంక్షలు అందించారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu