Don't Miss!
- Sports
టీ20ల్లో టాప్ ప్లేయర్లు.. వన్డేల్లో మాత్రం వేస్ట్.. టీమిండియా స్టార్ కూడా!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- News
బండి సంజయ్ నియోజకవర్గం ఖరారు?
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
త్రివిక్రమ్ శిష్యుడు...సప్తగిరి కామెడీ పవర్ చూపించబోతున్నాడు!
హైదరాబాద్: టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ తొలి ప్రయత్నంగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై అత్యంత గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు.

త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దాదాపు మూడు నెలలకి పైగా హైదరాబాద్, పోలాండ్ లో ఈ సినిమా షూటింగ్ తాజాగా ముగిసింది. స్టార్ సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ కెమెరా వర్క్ ఈ సినిమాకు ప్రత్యేక అకర్షణగా నిలుస్తోందని చిత్ర బృందం తెలిపింది.

ఇటీవలే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ కి సోషల్ మీడియాలో విశేష ఆదరణ లభిస్తోంది. ఇదే ఊపుతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ముగించి త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత డాక్టర్ రవికిరణ్ తెలిపారు . అలానే సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్, ఆడియో లాంఛ్ ఈవెంట్స్ జరుపుకోనుందని తెలిపారు.


శివప్రసాద్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్ ఘోష్, షాయాజీ షిండే, తులసి, షకలక శంకర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: గోపిని రుణాకర్, ఆర్ట్: కుమార్, స్టంట్స్: జాషువా, డైలాగ్స్: రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల, మ్యూజిక్: బుల్‌గానిన్, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, ఆడిషనల్ స్టోరీ, స్క్రీన్‌ప్లే: ఎ సప్తగిరి ప్రాజెక్ట్, కో ప్రొడ్యూసర్: డా.వాణి రవికిరణ్.