»   » సరసుడు: బడ్జెట్ తక్కువే కానీ సబ్జెక్ట్ బోలెడు ఉంది!

సరసుడు: బడ్జెట్ తక్కువే కానీ సబ్జెక్ట్ బోలెడు ఉంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు టి. రాజేందర్ దర్శకత్వంలో 1983లో వచ్చిన ప్రేమ సాగరం చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే... ఇప్పటికీ ఆ ఫ్లేవర్ పోకుండా యూత్ ను కట్టిపడే స్తోంది. ఇదే తరహాలో హీరో శింబు మన్మధ, వల్లభ తమిళ చిత్రాలు కూడా తెలుగులో మంచి విజయాలను సంపాదించుకున్నాయి.

ప్రస్తుతం శింబు సినీ ఆర్ట్స్, జెసన్ రాజ్ ఫిలిమ్స్ పతా కాలపై టి.రాజేందర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సరసుడు. ఈ చిత్రానికి శింబు, నయనతార జంటగా నటిస్తున్నారు. ఈ నెల 15న విడుదల సంధర్బంగా దర్శక నిర్మాత టి. రాజేందర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యం లో...

Sarasudu release on 15 September

టి.రాజేందర్ మాట్లాడుతూ - తెలుగు ప్రేక్షకులంటే నాకు చాలా ప్రేమ, ఎందుకంటే నేను అందించిన ప్రేమ సాగరం చిత్రాన్ని దాదాపు సంవత్సరం పాటు థియేటర్లలో ఆదరించారు. అంతే కాకుండా మా అబ్బాయి శింబు నటుంచిన మన్మధ, వల్లభ చిత్రాలను కూడా ఆదరించారు. అదే నమ్మకంతో మరోసారి సరసుడు చిత్రం తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాము అందరూ తప్పకుండా ఆదరించాలని కోరుతున్నాము, ఇక ఈ చిత్ర విషయానికి వస్తే యూత్ కు ఏం కావాలో అన్నీ ఇందులో ఉన్నాయి, సెంటిమెంట్, లవ్, స్టేట్ మెంట్ ఇలా అన్నీ ఉన్నాయి, సాంగ్స్ విషయానికి వస్తే మా రెండో అబ్బాయి కరల్ 5 పాటలకు సంగీతం అందించాడు. ఆడిన్స్ పల్స్ తెలుసుకొని పాటలకు లిరిక్స్ అందించాను, ఈ చిత్రం లో హలో పాటను కేవలం తెలుగు ఆడియన్స్ కోసమే టైటిల్ సింగ్ ను రాసాను, 'బావ వెయిటింగ్' అనే పాటను కూడా నేనె పాడటం జరిగింది, ఒక చిన్న సినిమా కు కావాల్సింది బడ్జెట్ కాదు సబ్జెక్ట్ అదే ఈ సరసుడు చిత్రం లో ఉంది, తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం తో నైజం, సీడెడ్, ఆంధ్రలలో మా సంస్థ నుంచే విడుదల చేయనున్నాం అన్నారు.

English summary
Popular Tamil hero Simbu, well-known to Telugu audiences for Manmadha and Dongaata, is awaiting the release of his 2016 Tamil hit, Idhu Namma Aalu, in Telugu. The film had Nayanthara as the female lead. Idhu Namma Aalu is going to be released in Telugu as Sarasudu. Sarasudu is all set for its release on September 15th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu