»   » పవన్ ఇంటర్వూ -2 : ఎర్ర కండువా, సిగ్గు, పార్టీ ,కొట్టాలనే, త్రివిక్రమ్ తో ఇంకెన్నో..

పవన్ ఇంటర్వూ -2 : ఎర్ర కండువా, సిగ్గు, పార్టీ ,కొట్టాలనే, త్రివిక్రమ్ తో ఇంకెన్నో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'అనుకొన్నది అనుకొన్నట్టుగా తీయడానికి కొన్ని పరిమితులుంటాయి. 'జాని' ఓటమిని నేను ఆనందంగానే స్వీకరించినా నా చుట్టూ ఉన్నవాళ్లు భరించలేకపోయారు. వాళ్లే ఓడిపోయినంత బాధపడ్డారు. వీళ్లేంటి ఇంత బాధపడుతున్నారు అనిపించింది.' అంటూ పవన్ చెప్పుకొచ్చారు. తన పరాజయ్యాన్ని కూడా నవ్వుతూ స్వీకరించే వ్యక్తి పవన్.

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్ తెచ్చుకున్నా వసూళ్లలో గత రికార్డుల్ని తిరగరాస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో పవన్ మాట్లాడారు. ఎన్నో విషయాలపై మొహమాటం లేకుండా మనస్సులో ఉన్నదున్నట్లు స్పందించారు.


హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లో పవన్‌కల్యాణ్ ఆఫీస్ లో ఈ ఇంటర్వూ జరిగింది. అక్కడ వాతావరణం పూర్తిగా సాహిత్యమయంగా ఉంది. వెయిటింగ్ హాలు దాటి ఆ డూప్లెక్స్ హౌస్‌లో లోపలికి వెళితే, ఒక చిన్న టేబుల్ మీద చాలా తెలుగు, ఇంగ్లీషు దినపత్రికలు... ఆ పక్కనే పుస్తకాల బీరువా.


పక్కనే ఉన్న చిన్నగదిలో బల్లపై విశ్వనాథ సత్యనారాయణ 'హాహా హూహూ', గుంటూరు శేషేంద్ర శర్మ 'ఆధునిక మహాభారతం', తిలక్ 'అమృతం కురిసిన రాత్రి', హిందీ, ఇంగ్లీష్ సాహిత్య రచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.సోఫాలో పవన్ కల్యాణ్. సర్దార్ నిర్మాత, సన్నిహితుడు అయిన శరత్‌మరార్‌తో మాట్లాడి, గ్యాప్ తీసుకుని ఇంటర్వూ ఇచ్చారు.


తన సినిమా రిజల్ట్, కలెక్షన్స్ గురించి పట్టించుకోనంటూ...తన తదుపరి చిత్రం గురించి, రాజకీయాల గురించీ, తన వ్యక్తిత్వం, తన పిల్లలు, తన వరస పెళ్లిళ్ల గురించి, తనపై సెటైర్స్ వేస్తున్న వర్మ గురించీ, జానీ ఫ్లాఫ్ గురంచి ఇలా రకరకాల విషయాలపై సమగ్రంగా పవన్‌ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు.


ఈ ఇంటర్వూ చూస్తూంటే పవన్ చాలా ఫ్రాంక్ గా మాట్లాడారని అర్దమవుతుంది. కొన్ని విషయాలపై ఆయన స్పందన చూస్తూంటే ఓ భావకుడు మాట్లాడినట్లు ఉంటే మరికొన్ని విషయాలలో ఆయనలోని పరిశీలనా శక్తికి ఆశ్చర్యమేస్తుంది. సినిమాల కన్నా, ప్రపంచం, తన ఫ్యాన్స్ వంటివారిపై ఆయనకు ప్రేమ అధికం అనిపిస్తుంది. అలాంటివారిని ఎవరు ఇష్టపడకుండా ఉండారు..ఎవరు ప్రేమించకుండా ఉండగలరు.


స్లైడ్ షోలో ఇంటర్వూ చూడండి..


ఒత్తిడి..

ఒత్తిడి..

‘జాని' ఫ్లాప్‌ కంటే అందరి అంచనాలే నాపై ఒత్తిడి పెంచాయి. అలాగని వాళ్లను వదిలి దూరంగా వెళ్లలేను. వాళ్లతోనే ఉండి రోజూ పోరాడలేను.‘జాని' తరవాత సినిమాలు మానేద్దాం అనుకొన్నా.


పదేళ్లు..

పదేళ్లు..

‘కానీ ఈ ఒక్క సినిమా చేయ్‌..' అనేవారు. దాని తరవాత ఇంకో సినిమా.. ఆ తరవాత మరోటి. ఇలా పదేళ్లు గడిచిపోయాయి.అందుకు కాదు..

అందుకు కాదు..

‘జాని' పరాజయంవల్లే మళ్లీ దర్శకత్వం వైపు అడుగు వేయలేదా? అంటే కాదనే చెప్పాలి. నాకు ప్రయాణం ముఖ్యం. ఫలితం కాదు. ఓ వ్యక్తి గురించి మాట్లాడాలంటే వాడు పుట్టినప్పటి నుంచీ చనిపోయేంత వరకు వాడి జీవితం చూసి నిర్ణయానికి రావాలి. అంతే తప్ప 24 గంటలూ గెలిచాడా, లేదా? అంటూ లెక్కలేసుకోకూడదు. దర్శకత్వం ఓ సృజనాత్మక పక్రియ.


బాధగా ఉంది

బాధగా ఉంది

అకీరాకు నేనంటే చాలా ఇష్టం. వాడు సినిమా వాతావరణానికి దూరంగా ఉంటున్నాడన్న సంతోషంగా ఉన్నా నా దగ్గర లేడనే బాధగా ఉంది.వాడికి కోపం..

వాడికి కోపం..

అకీరాకు ఆ బాధ ఉంది. అందుకే వాడికి నాపై కోపం. నా స్టార్‌ స్టేటస్‌, ఇమేజ్‌కు అకీరా దూరంగా ఉండటం మంచిదే. భవిష్యత్తులో తను ఏం చేస్తాడన్నది తన ఇష్టాయిష్టాల్నిబట్టే ఉంటుంది.


జీవితంలోనూ, తెర మీదా గన్స్

జీవితంలోనూ, తెర మీదా గన్స్

గన్స్... నేను మొదట ఏమని ఆలోచిస్తానంటే, మనం పని చేస్తున్న విషయం ప్రామాణికంగా ఉండాలనుకుంటా. అందుకనే, ఈ సినిమాలో వాడిన గన్స్ అన్నీ నిజమైన రక రకాల గన్స్ తాలూకు నమూనాలుగా చేయించా.


ఆ నమూనాలే..

ఆ నమూనాలే..

'మద్రాస్ రైఫిల్ క్లబ్'లో మెంబర్‌ని. అక్కడి నా పరిచయాలన్నీ వాడుకొని, వాళ్ళ సలహా సూచనలతో ఆ నమూనాలు చేశాం. బేసిక్‌గా మొక్కలు, తుపాకులు బాగా ఇష్టం.ఇప్పటికైతే..

ఇప్పటికైతే..

ఎర్ర తుండు వేసుకున్నారు. మొక్కలు... తుపాకులా? లేక అడవులు... తుపాకులా? అంటే... (నవ్వేస్తూ) ఇప్పటికైతే మొక్కలు, తుపాకులే!గుర్రపు స్వారీ రాదు..

గుర్రపు స్వారీ రాదు..

నిజానికి, నాకు గుర్రపుస్వారీ రాదు. ఎప్పుడూ నేర్చుకోలేదు. 'గబ్బర్ సింగ్' టైమ్‌లో తొలి సారిగా గుర్రపుస్వారీ చేయాల్సి వచ్చింది.


గుర్రంతో మాట్లాడా

గుర్రంతో మాట్లాడా

తొలి సారిగా గుర్రపుస్వారీ చేసేటప్పుడు...కింద పడి, తల పగిలితే ఏమిట్రా బాబూ అని కొద్దిగా భయం వేసిందంటే నమ్మండి. అప్పుడు నేను గుర్రం దగ్గరకెళ్ళి దానితో మాట్లాడా.సహకరించమన్నా...

సహకరించమన్నా...

(నవ్వులు..) నాకు గుర్రపుస్వారీ రాదని, సహకరించమని చెప్పుకున్నా. నా కమ్యూనికేషన్ ఏమర్థమైందో ఏమో గుర్రం సహకరించింది. ఒకసారి జీను పెకైక్కి కూర్చున్నాక, నాకు తెలియకుండానే పట్టు దొరికింది.


అలవాటైపోయింది

అలవాటైపోయింది

అంతే! ఇక, 'సర్దార్ గబ్బర్ సింగ్'కి నాకు అలవాటై పోయింది. ముఖ్యంగా ఈ సిన్మాకు వేసిన సువిశాలమైన రతన్‌పూర్ సెట్ ప్రాంగణంలో అటూ, ఇటూ తిరగడానికి గుర్రమే వాడా. షాట్‌కీ, షాట్‌కీ మధ్య గ్యాప్‌లో రోజుకు అయిదారు సార్లు గుర్రపు స్వారీ చేశా!


అన్నయ్య బెస్ట్..

అన్నయ్య బెస్ట్..

నాతో పోలిస్తే, అన్నయ్య (చిరంజీవి) అవలీలగా, స్వారీ చేస్తారు. ఆయనకు బాగా వచ్చు. నేను బాగా వచ్చినట్లు నటించాను (నవ్వులు).ఆధునిక మహాభారతం

ఆధునిక మహాభారతం

గుంటూరు శేషేంద్ర శర్మగారు రాసిన పుస్తకం ఇది. ఆయన అభివ్యక్తి బాగుంటుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్నీ ప్రతిబింబించే పుస్తకం ఇది. కొన్ని పుస్తకాల్ని పదే పదే చదువుతుంటా. అలాంటి పుస్తకాల్లో ఇదొకటి.


ఇతిహాసాల్లో నచ్చిన పాత్ర?

ఇతిహాసాల్లో నచ్చిన పాత్ర?

పరశురాముడు అంటే ఇష్టం. ఆయన ‘నేను' అనే అహంకారాన్ని చంపిన వ్యక్తి.కథ అనుకోను..

కథ అనుకోను..

సాధారణంగా నేను రామాయణ మహాభారతాల్ని ఓ కథగా అనుకోను. అందులో ఏ విషయం ఉన్నా అది నాకు అన్వయించుకుంటా. ఓ ఘట్టంలో పైకి కనిపించే కథ వేరు. లోపల పొరల్లో దాగున్న భావం వేరు. ఆ భావం ఏమిటో వెతుకుతూ చదవడం నాకిష్టం.


కోపం వస్తుంది..

కోపం వస్తుంది..

నా ఆవేశం, నా కోపం ఓ సమస్యమీదే. నా కళ్ల ముందు ఏదైనా తప్పు జరిగితే కోపం వచ్చేస్తుంది.


ఓడిపోయినప్పుడు కూడా..

ఓడిపోయినప్పుడు కూడా..

నా సినిమా ఫ్లాప్‌ అయ్యిందనో, అప్పుల పాలయ్యాననో నాపై, నా చుట్టూ ఉన్న వ్యక్తులపై కోపం తెచ్చుకోను. ‘ప్రజారాజ్యం' పెట్టినప్పుడు ఎన్నికల్లో ఓడిపోయాం. అప్పుడేమీ ఆవేశపడలేదు.ఆర్దికంగా..

ఆర్దికంగా..

భారీ పారితోషికం తీసుకొనే హీరో మీరు. ఆర్థికంగా నిలబడకపోవడమేమిటి? కారణం.. నా కెరీర్‌లో నాకొచ్చింది నేను చేసుకొంటూ వెళ్లా. డబ్బుల గురించి ఆలోచించలేదు.జాగ్రత్తపడలేదు

జాగ్రత్తపడలేదు

ఈ సినిమాకొచ్చిన డబ్బులతో ఓ ఇల్లు కొనాలి, ఓ స్థలం కొనుక్కోవాలి, దాచుకోవాలి.. అంటూ జాగ్రత్త పడలేదు. అలా జాగ్రత్త పడాలని చెప్పినవాళ్లు లేరు. నేను ఎంత సంపాదిస్తే అంతా ఖర్చయిపోయేవి.


గద్దర్ అన్నట్లు

గద్దర్ అన్నట్లు

‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'కి మంచి స్పందన వస్తోంది. విడుదలైన తర్వాత బావుందని చెప్పేవాళ్లుంటారు. తిట్టేవాళ్లుంటారు. గద్దర్‌ ఓ సందర్భంలో అన్నట్టు నాకు పోరాటం చేయడమే ముఖ్యం. మజిలీ కాదు.


మాటిచ్చా..పూర్తి చేసా

మాటిచ్చా..పూర్తి చేసా

‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' పూజ చేసిన వెంటనే ‘పాలిటిక్స్‌లోకి వెళ్తున్నాను' అని నిర్మాత శరత్‌గారితో చెప్పాను. ‘అదేంటి?' అన్నట్టు చూశారాయన. అయినా సినిమా పూర్తి చేస్తానని మాటిచ్చాను. అలాగే పూర్తి చేశాను.


పొలిటికల్ డైలాగులు..

పొలిటికల్ డైలాగులు..

ఈ చిత్రంలో నా పొలిటికల్‌ కెరీర్‌ని టచ్ చేసేటట్టు కొన్ని డైలాగులు ఉన్నాయి. అయితే అవన్నీ కావాలని రాసినవి కావు. రైటర్స్‌ నన్ను దృష్టిలో పెట్టుకుని రాసినవి. డైలాగులు రాయడంలో నాకు పట్టులేదు.


నాకు నచ్చదు..

నాకు నచ్చదు..

స్టోరీ రాస్తాను. కథను కూడా పాత్రల పేర్లతోనే రాసుకుంటాను. ఒక వ్యక్తిని అందరూ ఆరాధిస్తున్నట్టు రాయడం నాకు నచ్చదు. అంతగా ఆరాధిస్తే కష్టమవుతుంది.


అందుకే..

అందుకే..

పిక్చర్‌ పర్ఫెక్ట్‌ ఇమేజ్‌ మంచిది కాదు. అందుకే నా పక్కనున్న పాత్రలు కూడా నన్ను ఆటపట్టిస్తున్నట్టు ‘సర్దార్‌'లో రాశాను.పవర్ స్టార్ నచ్చదు..

పవర్ స్టార్ నచ్చదు..

అంతెందుకు పేరుకు ముందు ‘పవర్‌ స్టార్‌' అనే పదం రాసుకోవడం నాకు నచ్చదు. హాలీవుడ్‌లోనూ, హిందీలోనూ అలా రాసుకోరు. ఇక్కడ ఆ సంస్కృతి ఉంది. అది ఎందుకు వచ్చిందని ఆరాతీస్తే... ‘ఆరాధిస్తారు' అనే సమాధానం వినిపించింది.


ఒత్తిడివల్ల తప్పడం లేదు..

ఒత్తిడివల్ల తప్పడం లేదు..

ఆడియో వేడుకలు చేసుకోవడం కూడా నాకు పెద్దగా నచ్చదు. ‘గుడుంబా శంకర్‌' తర్వాత ఒత్తిడి వల్ల తప్పడం లేదు.వట్టి పవన్ నే..

వట్టి పవన్ నే..

పవర్‌స్టారా? పవర్ మేకరా? పవర్ మాంగరా? (నవ్వేస్తూ...) ఇవేవీ కాదు. నేను వట్టి పవన్ కల్యాణ్‌ని! అంతే!


మార్షల్ ఆర్ట్స్ పై

మార్షల్ ఆర్ట్స్ పై

క్లైమాక్స్‌లో విలన్‌తో చేసే ఫైట్‌లో ఫిలిప్పైన్స్‌కు చెందిన మార్షల్ ఆర్ట్ 'ఎస్‌క్రిమా' వాడాను. అలాగే, మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్లీ పెంపొందించిన చైనీస్ తరహా కుంగ్‌ఫూ 'జీత్ కునే డో' కూడా! ఇవన్నీ 'జానీ' సినిమా టైమ్‌లో నేర్చుకున్నా. ప్రత్యర్థిని బ్లాక్ చేయడం, పంచ్ కొట్టడం - రెంటికీ పెద్ద గ్యాప్ ఉండదు.


ఛారిత్రాత్మకం వద్దు..

ఛారిత్రాత్మకం వద్దు..

చారిత్రాత్మక పాత్రల్లో కనిపించాలంటే దానికి తగ్గ దేహధారుడ్యం లేదు. నా శరీరానికి కవచం వేసుకుంటే కామెడీగా ఉంటుంది.మోజు లేదు

మోజు లేదు

నాకు సినిమాల మీద మోజు లేదు. నాలో లోపలున్నది వేరే. యాక్సిడెంటల్‌గానే సినిమాల్లోకి వచ్చాను. ఒక్క సినిమా సమయంలో 3 నెలలు మరేవీ ఆలోచించను.


వీలైనన్ని..

వీలైనన్ని..

నాకిష్టమైనది సినిమానే. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా వచ్చేలోపు ఎన్ని వీలైతే అన్ని సినిమాలు చేస్తాను. 2 కావొచ్చు. 3 కావొచ్చు. దాసరితో సినిమా చేయాలని ఉంది. చేస్తాను. కథ ఆయనదే. నిర్మాతగా కూడా ఆయనే ఉంటారు.


పూర్...

పూర్...

నా కెరీర్‌లో చేసింది 20 సినిమాలే. నాకు పెద్దగా డబ్బులు అవసరం లేదు. నా చుట్టూ చాలా మంది ఉంటారు. ఖర్చులుంటాయి. నేనెక్కడికీ ఒంటరిగా వెళ్లలేను. సెక్యూరిటీ కావాలి. అలాంటి కనిపించని ఖర్చులుంటాయి. అవన్నీ తడిసి మోపెడయ్యేవి. మనీ మేనేజ్‌మెంట్‌ విషయంలో జాగ్రత్తగా లేను.


పాదయాత్రో, బస్సు యాత్రో..

పాదయాత్రో, బస్సు యాత్రో..

నేను ప్రజా సమస్యలపై పోరాటాన్ని నమ్ముతాను. అధికారం అనేది వాటి నుంచే ఉప ఉత్పత్తి. నాకు జనంలో ఉండటం ఇష్టం. పాదయాత్ర చేయాలా, బస్సు యాత్ర చేయాలో చేస్తాను. ఎలా చేస్తానన్నది చూడాలి!


అందుకే విదేశాల్లో..

అందుకే విదేశాల్లో..

కెమెరా ముందూ ఆ సిగ్గు ఉంటుంది. డ్యాన్స్‌ చేయాలన్నా, నటించాలన్నా సిగ్గే. రోడ్డు మీదకు తీసుకెళ్లి.. ‘ఇక్కడో స్టెప్పు వేయండీ' అంటే కుచించుకుపోతా. అందుకే విదేశాల్లో ఎవరూ లేని చోట నాకు తోచిన స్టెప్పులేస్తా (నవ్వుతూ).


నడిరోడ్డుపై...

నడిరోడ్డుపై...

కథకి అనుగుణంగా ఉందనిపించినప్పుడు మాత్రం నడిరోడ్డుపై సీన్‌ తీయాలన్నా అందుకు సిద్ధమవుతా.నచ్చదు..

నచ్చదు..

నా సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడటం నచ్చదు. ‘మేం పొడిచేశాం.. ఇంత ఖర్చు పెట్టాం' అని చెప్పుకోలేను.ఎంత రిచ్? ఎంత పూర్?

ఎంత రిచ్? ఎంత పూర్?

ఇన్‌కమ్ ట్యాక్స్ బ్యాలెన్‌సషీట్ చూస్తే 20 కోట్లు డెఫ్సిట్.పూనే వెళ్తా..

పూనే వెళ్తా..

నేను పిల్లలను చూసి, 4 నెలలైంది. ఈ సినిమా బిజీలో పడి వెళ్ళలేదు. పిల్లలు బెంగ పడుతున్నారు.సాయంత్రం గుర్తొచ్చి ఫోన్ చేసి, సారీ చెప్పాను. రేపో, ఎల్లుండో పుణే వెళ్ళి, చూసొస్తామ్యూజిక్ సెన్స్ ఉంది..

మ్యూజిక్ సెన్స్ ఉంది..

చిరంజీవిగారు, రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌లాగా నేను డ్యాన్సులు చేయలేను. కాకపోతే మ్యూజిక్‌ సెన్స్ ఉంది. మంచి సంగీతం సినిమాకు హెల్ప్‌ అవుతుందని నమ్ముతాను.


బ్రోకెన్ మరాఠి

బ్రోకెన్ మరాఠి

మా ఇంట్లో నానా భాషా సమితి కనిపిస్తుంది. మా అమ్మాయి ఆద్య మరాఠీలో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి కోసం నేను బ్రోకెన్‌ మరాఠీ మాట్లాడాల్సి వస్తుంది.ఎవడో జీవితం బ్రతుకుతున్నా

ఎవడో జీవితం బ్రతుకుతున్నా

ఇక ఇంట్లో ఉన్న చిన్న కూతురుతో తెలుగులో మాట్లాడదామంటే ఆ అమ్మాయికి ఇంగ్లిషే వస్తుంది. నాకు అర్థం కాదు. ఇదంతా ఆలోచిస్తే ఎవడో జీవితాన్ని నేను బతుకుతున్నట్టు ఉంది తప్ప నా జీవితాన్ని బతుకుతున్నట్టు లేదు.క్రిష్టియన్స్..

క్రిష్టియన్స్..

నా భార్య అన్నా లెజినోవా ఆర్ధోడాక్స్‌ క్రిస్టియన్‌. వాళ్ల విశ్వాసానికి తగ్గట్టుగానే మా అమ్మాయిని పెంచుతున్నా. పోలెనా అని పేరు పెట్టడానికి కారణం అదే.ట్రాన్స్‌లేటర్

ట్రాన్స్‌లేటర్

అన్నా లెజినోవా వయొలిన్‌ ప్లేయర్‌. తను లింగ్విస్టిక్‌ ఎబిలిటీలో ట్రాన్స్‌లేటర్‌. తెలుగు చదువుతుంది.భయపడి..

భయపడి..

మొన్న మావాడు తెలుగు పుస్తకం చదువుతూ ఉంటే పక్కనే కూర్చుని అందులోని అక్షరాల్ని గగం అని తనూ చదువుతూ ఉంది. పక్కనున్న ‘న'ని ఎక్కడ స అంటుందో అని భయపడి నేనే గగనం అని చెప్పా (నవ్వుతూ).''పెద్దగా తెలీదు

పెద్దగా తెలీదు

చిన్నప్పుడు శారీరకంగా బలం ఉండేది కాదు. కొంతమందిని కొట్టాలనిపించేది. కొట్టాలంటే బ్రూస్లీలా కరాటే నేర్చుకోలనుకోవడం తప్ప పెద్దగా తెలీదు.అలా నేర్చుకున్నా

అలా నేర్చుకున్నా

కనీసం ఎవడైనా కొడుతుంటే వాడి నుంచి కాపాడుకోవడానికైనా కొన్ని విద్యలు తెలుసుండాలి అనుకొన్నా. అలా నేర్చుకొన్నవే మార్షల్‌ ఆర్ట్స్‌. వీటిని నేర్చుకోవడం వల్ల సహనం పెరిగింది.టీడీపికు మార్కులెన్ని..

టీడీపికు మార్కులెన్ని..

(నవ్వుతూ) నాకు లెక్కలు సరిగా రావు. అయినా... మార్కులు ప్రజలే వేయాలి.పీఆర్పీతో తెలుసుకున్నా

పీఆర్పీతో తెలుసుకున్నా

''ఏ పని చేసినా నిజాయితీగా చేస్తా. రాజకీయాల్లో నిలబడగలనన్న నమ్మకం నాకుంది. ఓటమి గెలుపుల గురించి ఆలోచించకూడదని పీఆర్పీ ఓటమితో తెలుసుకున్నాను'' అని తెలిపారు.ఫెరఫెక్ట్ డబ్బింగ్..

ఫెరఫెక్ట్ డబ్బింగ్..

మామూలుగా డబ్బింగ్‌ కోసం మన ప్రమేయం లేకుండా సినిమాలను అమ్మేస్తారు. అలాంటప్పుడు ఇర్రెలవెంట్‌ డబ్బింగ్‌ ఉంటుంది. అది నాకు నచ్చలేదు. అందుకే ప్రాపర్‌గా డబ్బింగ్‌ సింక్‌ చేసి హిందీలో విడుదల చేశాం.లుంగీలు కట్టుకోనివ్వలేదు..

లుంగీలు కట్టుకోనివ్వలేదు..

మా ఇంట్లో మా అమ్మా, వదినా ఎప్పుడూ నన్ను పెద్దవాడిగా చూడలేదు. యుక్తవయసు వచ్చినా సరే లుంగీలు కూడా కట్టుకోనివ్వలేదు.పంచెలు కడతా..

పంచెలు కడతా..

అందుకే ఇప్పుడు ఏమాత్రం అవకాశమున్నా పంచెలు కట్టుకుంటా. వారిమీద కక్షతో పంచెలు కట్టుకుని నేను పెద్దవాడినయ్యానని చెప్పకనే చెబుతుంటా.


తేడా వస్తే పాతేస్తారు..

తేడా వస్తే పాతేస్తారు..

చిరంజీవిగారి 150వ సినిమాకు సాయం చేయాలనే ఆలోచన నాకు లేదు. చిరంజీవిగారి కోసం ఆలోచించడమనేది చాలా పెద్ద బాధ్యత. తేడా వస్తే పాతేస్తారు. అదే నా విషయంలో తేడా వస్తే నేను భరిస్తాను.


వాటిమీదే..ట

వాటిమీదే..ట

సినిమాల్లో నాకు కెమెరాపనితనం, డైలాగులు, మరికొన్ని సాంకేతిక విభాగాలు ఇష్టం. ఆ తర్వాతే నటన మీద ఆసక్తిని చూపిస్తాను.


ఎక్కువ సమయం

ఎక్కువ సమయం

ఎందుకంటే నెరసిన గడ్డానికి రంగు వేసుకోవడానికే నాకు ఎంతో సమయం పడుతుంది.చేసేసా...

చేసేసా...

నాకు డ్రీమ్‌ కేరక్టర్లు ఏమీ లేవు. మెథడ్‌ యాక్టర్‌ని కాను. కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్‌లు ఉండేవి. వాటిని నా చిత్రాల్లో
చేసేశాను.


ఏదైనా కావచ్చు..

ఏదైనా కావచ్చు..

అఖీరాకురసోవా అంటే నాకున్న గౌరవంతో నా కొడుక్కి ఆ పేరు పెట్టుకున్నా. వాడు రేపు రైటర్‌ కావొచ్చు, డైరక్టర్‌ కావచ్చు. ఇంకేదైనా కావచ్చు.


జుగుప్స

జుగుప్స

అకీరా పేరుకు ముందు జూనియర్‌ పవర్‌స్టార్‌ అనే ట్యాగ్‌ వింటుంటే నాకు జుగుప్సగా ఉంది. తలవంచుకుని పారిపోవాలనిపిస్తోంది.


చెప్పను..

చెప్పను..

ఫ్రెష్‌ మైండ్‌ని పొల్యూట్‌ చేయడం ఇష్టం లేదు. మా నాన్న మమ్మల్ని ఇనఫ్లుయన్స్ చేయలేదు. మా అక్క కొడుకైనా, ఎవరైనా ఫలానా చోట ట్రయిన్ అవ్వమని చెబుతానే కానీ, భుజాల మీద వేసుకుని ప్రమోట్‌ చేస్తానని ఎప్పుడూ చెప్పను. ఈ రంగంలోకి దిగాక ఫైనల్‌గా కష్టపడాల్సింది వాళ్లే.


వారసుడనే ఆలోచన లేదు..

వారసుడనే ఆలోచన లేదు..

అఖీరాను నా వారసుడిగా సినిమాల్లోకి తీసుకురావాలనే ఆలోచన లేదు. వారసత్వమంటే నాకు విసుగు. తండ్రులకున్న హోదాని పిల్లలకు ఎందుకు ఆపాదించాలన్నది నా ప్రశ్న. పిల్లలు సహజంగా ప్రయోజకులు కావాలి. అంతేగానీ వాళ్లని ముందుకు తోయడం నాకు చిరాకు. సిల్లీగా అనిపిస్తుంటుంది.తెలంగాణా అంటే ఇష్టం..

తెలంగాణా అంటే ఇష్టం..

పోటీ చేసే పక్షంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడాలి. అది నాకిష్టం లేదు. ఎందుకంటే నాకు తెలంగాణ అంటే ఇష్టం. ఇక్కడే ఎక్కువ కాలం ఉన్నా. ఇక్కడి పరిస్థితులపై నాకు పూర్తి అవగాహన ఉంది. విడిపోవాలనుకొన్నప్పుడు ఆనందంగా విడిపోవాలి. ఆ విభజన వల్ల ఎవరూ నష్టపోకూడదన్నది నా అభిప్రాయం.


అందుకే బయిటకు రాలేదు..

అందుకే బయిటకు రాలేదు..

‘జై ఆంధ్రా' ఉద్యమంలోనూ నేను బయటకు రాకపోవడానికి కారణం ఒకటే. ఆ సమయంలోనూ నేను తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడాలి. మనసులో వ్యతిరేకత లేనప్పుడు ఏం మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి?టీడీపీ అందుకే ..

టీడీపీ అందుకే ..

ఆ సమయంలో అనుభవం ఉన్న పార్టీకీ, నాయకుడికి అధికారం దక్కడమే సమంజసం అనిపించింది. అందుకే తెదేపాకు మద్దతు ఇచ్చా.త్రివిక్రమే రాసాడు..

త్రివిక్రమే రాసాడు..

ఎన్నికల సమయంలో మీ ప్రసంగాలన్నీ మీ స్నేహితుడు త్రివిక్రమ్‌ చేతే రాయించారట. నిజమేనా? అలా అనుకోవడంలో తప్పేం లేదు. నా అభిప్రాయాలను నా పక్కవాళ్లతో పంచుకోవడం ఇష్టం. ఎవరేం చెప్పినా వింటాను. అభిప్రాయాల్నీ తెలుసుకొంటా. నాకంటూ ఓ స్పష్టమైన ఎజెండా ఉంది.ఎలా మాట్లాడతా...

ఎలా మాట్లాడతా...

ఎన్నికల ప్రసంగాలు ఎవరితోనో రాయించుకొంటే మరి ప్రెస్‌మీట్స్‌లో ఎలా మాట్లాడతా? అప్పుడు ‘ఈ ప్రశ్న అడిగారు, ఏం చెప్పమంటారు?' అని నేను అవతలివాళ్లకి ఫోన్‌ చేయాలా? నేను, త్రివిక్రమ్‌ స్నేహితులం కాబట్టి అలా అనుకొంటుంటారంతే. కానీ నావైన భావాల్నే బయటపెడుతుంటా.


వెటకారం చేసారు...

వెటకారం చేసారు...

స్టార్స్ వ్యక్తిగత జీవితం పబ్లిక్‌ అయిపోతుంటుంది. అందులో తప్పేం ఉంది. ఎవరిష్టం వాళ్లది. నా వ్యక్తిగత జీవితం గురించి చాలాసార్లు రాశారు. నా పెళ్లిళ్ల గురించి వెటకారం చేశారు. అది కాదనలేని ఖండించలేని భారం.


నేను మారను

నేను మారను

మీరు రాసుకోండి. నేనేం మారను కదా? మీ కథలు మీవి. నా జీవితం నాది. సెలబ్రెటీల జీవితంలో అదీ ఓ భాగం. అందరూ మన గురించి మంచే మాట్లాడుకొంటారా? అయినా నేనేంటో నాకు తెలుసు కదా? మరొకరు చెప్పాలా?


భరిస్తా..

భరిస్తా..

ఒకరు పొడిగితే సంబరపడతానా. తిడితే పట్టించుకొంటానా? ఎవరేం చెప్పినా వింటాను. నూటికి 90 సార్లు భరిస్తాను. మరీ పరిధి దాటి మాట్లాడితే అప్పుడు గట్టిగానే సమాధానం చెబుతా.


ఎవర్నీ వదలను..

ఎవర్నీ వదలను..

అవతల ఉన్నది ఏ స్థాయి వ్యక్తయినా సరే వదలను. నా గురించి మాట్లాడుతున్నారు సరే.. వాళ్ల జీవితాలైనా సరిగ్గా ఉన్నాయా? మీరంత నిక్కచ్చిగా ఉన్నారా? నాకు బతకడం ఇష్టం. కానీ పిరికితనంతో బతకలేను. విమర్శలకు కుంగిపోయే తత్వం కాదు నాది.ప్రశ్నించటం లేదే..

ప్రశ్నించటం లేదే..

ప్రశ్నించడం కోసమే పార్టీ అన్నారు. ఇప్పుడు ప్రశ్నించడానికి చాలా విషయాలున్నా స్పందించడం లేదన్న విమర్శ ఉంది. అది ఒప్పుకుంటా. ఆ రోజు చెప్పావు కదా, మరి ప్రశ్నించడం లేదే అని నన్ను నిలదీసే హక్కు ఎవరికైనా ఉంది. అయితే నేనొక్కడినే ఉన్నానిప్పుడు. నాకంటూ ఒక మిషన్‌ ఏర్పాటయ్యేందుకు ఇంకాస్త సమయం పడుతుంది.


English summary
All the time Telugu Media is eagerly waiting for Pawan's press conference, but now he stunned them by offering appointment and gave exclusive interviews.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more