»   » అల్లు అర్జున్ ఎగ్జైట్మెంట్: నేను 100 కోట్లు, చిరంజీవి 150 కొట్లు!

అల్లు అర్జున్ ఎగ్జైట్మెంట్: నేను 100 కోట్లు, చిరంజీవి 150 కొట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'సరైనోడు' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీసు వద్ద రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన నేపథ్యంలో ఇటీవల విజయవాడలో 'బ్లాక్ బస్టర్ ఫంక్షన్' పేరుతో ఓ ఈవెంటు నిర్వహించారు. ఈ వేడుకలో బన్నీతో పాటు చిత్ర యూనిట్ మొత్తం పాల్గొని సందడి చేసారు.

ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.... తన కెరీర్లో తొలిసారి 100 కోట్ల గ్రాస్ రావడంపై ఎంగ్జైట్మెంట్ వ్యక్తం చేసాడు. 'రూ. 100 కోట్లు గ్రాస్ చేయ‌టం నా చిత్ర‌ల్లో ఇది బెస్ట్ గా నిల‌వ‌టం చాలా ఆనందంగా వుంది. నన్ను అభిమానించే మెగా అభిమానుల‌కి, ఇత‌ర రాష్ట్రంలో ని న‌న్ను ప్ర‌త్యేఖంగా అభిమానించే వారే కాకుండా ఇంకా సినిమాని అభిమానించే ప్రేక్ష‌కులంద‌రి అశీర్వాదాలు నాకున్నాయి. నేను కొంత‌మందిని డైరెక్ట్ గా క‌ల‌వ‌క పోవ‌చ్చు కాని వారి ఆశీర్వాదం నాకు ద‌క్కుతుంది అనేదానికి నిద‌ర్శ‌నం స‌రైనోడు బ్లాక్‌బ‌స్ట‌ర్ అవ్వ‌ట‌మే' అని అన్నారు.


ఫోటో గ్యాలరీ : సర్రైనోడు బ్లాక్ బస్టర్ ఫంక్షన్


మా నాన్నగారి బేనర్లో అసలైన కిక్
నా చిత్రం 100 కోట్లు గ్రాస్ రావ‌టం అది కూడా మా నాన్న గారి బ్యాన‌ర్ లో రావ‌టం కిక్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారి 150 వ చిత్రం 150 కొట్లు షేర్ చేయ్యాల‌నేది నాకోరిక‌. మెన్న డైర‌క్ట‌ర్ వినాయ‌క్ గారికి అదే చెప్పాను. చిరంజీవి గారి మాస్ చిత్రాలు చూసి పెరిగాను. అన్ని మాస్ చిత్రాలు చెయ్య‌లేదు కాని మాస్ అంటే చాలా ఇష్టం. బోయ‌పాటి శ్రీను గారు నాకు ఊర‌మాస్ అనే టైటిల్ ఇచ్చినందుకు చాలా హ్య‌పిగా వుంది అన్నారు అల్లు అర్జున్.


సరైనోడు

సరైనోడు

సరైనోడు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తో దూసుకెళ్తోందని బన్నీ తెలిపారు.


ఈ పంక్షన్ కు కారణం

ఈ పంక్షన్ కు కారణం

అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ ను వసూలు చేస్తూ... ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన రావడంతో సక్సెస్ సంబరాల్ని గ్రాండ్ గా చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించింది.


అల్లు అరవింద్ మాట్లాడుతూ..

అల్లు అరవింద్ మాట్లాడుతూ..

స‌రైనోడు బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫంక్ష‌న్ చేయ‌టం చాలా ఆనందంగా వుంది. మంచి కోసం మాత్ర‌మే మ‌నం వుండాలి అనే స‌రైనోడు పాత్ర బ‌న్ని నిజ‌జీవితానికి ద‌గ్గ‌ర‌గా వుంది. బ‌న్ని అంతే మంచి జ‌ర‌గాలనిమాత్ర‌మే కోరుకుంటాడు. అందుకే ఈ చిత్రం అంత ఘ‌న‌విజ‌యం సాధించింది. అన్నారు.


చిరు 150కి తొలిమెట్టు

చిరు 150కి తొలిమెట్టు

ఈ సినిమా విజ‌యం లో ప్ర‌ధాన పాత్ర మా మెగా అభిమానుకే చెందుతుంది. స‌రైనోడు అనే చిత్రాన్ని వారంద‌రూ క‌ల‌సి ఈ ఘ‌న‌విజ‌యాన్ని అందించారు. ఈ ఘ‌న‌విజ‌యం మెగాస్టార్ చిరంజీవి గారి 150 చిత్ర ఘ‌న‌విజ‌యానికి తొలిమెట్టుగా నేను భావిస్తున్నాను అని అల్లు అరవింద్ తెలిపారు.


బోయపాటి

బోయపాటి

బ‌న్ని నాకు హీరో, బ్ర‌ద‌ర్ కంటే ఎక్కువ‌. నేను ద‌ర్శ‌కుడు అవ్వ‌టంలో బ‌న్ని పాత్ర వుంది. మా కాంబినేష‌న్ లో వ‌చ్చే మ‌రో చిత్రం దీని మించి వుంటుంది అన్నారు బోయపాటి.
English summary
Telugu Movie Sarrainodu Blockbuster Function event held at Vijayawada. Allu Arjun, Allu Aravind, Aadhi and others graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu