»   » పక్కన పడేసి పనికిరాదన్న కథే, శతమానం భవతి అయ్యింది :సతీశ్ వేగేశ్న

పక్కన పడేసి పనికిరాదన్న కథే, శతమానం భవతి అయ్యింది :సతీశ్ వేగేశ్న

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ సంక్రాంతికి పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైంది 'శతమానం భవతి'. కానీ తర్వాత సంక్రాంతి సినిమాల్లోకెల్లా అతి పెద్ద బ్లాక్ బస్టర్ లలో ఒకటి అయ్యింది. భారీ సినిమాలమధ్య వచ్చిన ఈ సినిమా పెట్టుబడికీ అది సాధించిన లాభలకీ ఉన్న తేడాలను చూసే ఈ ఏడాది సూపర్ హిట్లలో శతమానం భవతి కూడా ఒకటి అయ్యింది ఈ సినిమా.

ఇంతకుముందు దొంగలబండి, రామదండు లాంటి ఫ్లాప్ సినిమాలు తీసిన సతీశ్ వేగేశ్న 'శతమానం భవతి'తో తనేంటో రుజువు చేసుకున్నాడు. 'శతమానం భవతి' గురించి చెబుతూ.. ఇది దశాబ్దంన్నర కిందట పుట్టిన కథ అని సతీశ్ వెల్లడించాడు. అతను 'ఈనాడు' పత్రికలో పని చేస్తుండగా ఈ కథ పుట్టిందట. దీనికి సంబంధించిన నేపథ్యమేంటో అతడి మాటల్లోనే వింటే.....

Shatamanam Bhavati Story


"దాదాపు 17 ఏళ్ల క్రితం ఈ ఆలోచన పుట్టింది. నేను ఈనాడులో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న కాలంలో దసరా, దీపావళి, సంక్రాంతికి మాత్రమే సెలవులు వుండేవి. పండుగ రోజు సెలవు దొరికితే పండుగ ఫీల్ లేదే అని బాధ వుండేది. ఆ రోజు పడుకోవడానికి సెలవు దొరికింది అనుకునే వాడిని. ఒక్క రోజు సెలవు దొరకడం వల్ల ఇంటికి వెళ్లలేకపోయేవాడిని.

ఈ నేపథ్యాన్ని ప్రేరణగా తీసుకొని పల్లె పయనమెటు అనే పేరుతో చిన్నకథను రాసి ఆంధ్రప్రభ ఉగాది కథల పోటీకి పంపించాను. ఒక అమ్మాయి తన తాతయ్య దగ్గరికి పల్లెటూరికి వస్తుంది. ఆ అమ్మాయి అనుకున్న రీతిలో ఆ గ్రామీణ వాతావరణం వుండదు. ఈ సంస్కృతి , సంప్రదాయాన్ని రేపు నా పిల్లలకు, వారి పిల్లలకు పరిచయం చేయాలంటే నేటి అనుబంధాలు, ఆప్యాయతలు ఇలాగే వుంటాయా? అని ఓ అమ్మాయి తన తాతయ్యను అడుగుతుంది.

దానికి జనం సమాధానం చెప్పాలమ్మా అంటాడు. పల్లెటూళ్లు ఎదగడం అవసరమే కానీ దాని మూలాల్ని మాత్రం మరిచిపోకూడదు అనే కాన్సెప్ట్‌తో రాసిన ఈ కథని పది రోజుల తరువాత ప్రచురణకు అనర్హమైనదని ఆంధ్రప్రభవారు తిరిగి పంపించారు. ఆ తరువాత కబడ్డీ కబడ్డీ చిత్రీకరణ సమయంలో జగపతిబాబుకు ఇదే కథ వినిపించాను.

ఆయనకు నచ్చడంతో లఘు చిత్రం చేద్దాం.. నేను డబ్బులు పెడతాను.. నువ్వే దర్శకుడివి అన్నారు. కబడ్డీ కబడ్డీ హిట్ తరువాత నేను రచయితగా బిజీ అయిపోయి ఆ కథను పక్కన పెట్టేశాను. ఓ సందర్భంలో స్నేహితులకు కథ వినిపిస్తే ఆ కథనే సినిమా కథగా మార్చొచ్చు కదా అన్నారు.

వాళ్లు అన్నట్టుగానే సినిమా స్క్రిప్ట్‌గా సిద్ధం చేసి పక్కన పెట్టాను. ఆ తరువాత ఈ కథను దిల్‌రాజుకు వినిపిస్తే బాగుంటుందని ఆయనకు చెప్పాను. ఆయన ఓకే చెప్పటం తో ఇల్లా శతమానం భవతి తెరమీదకి వచ్చింది" అంటూ శతమానం భవతి కథ వెనుక ఉన్న కథని చెప్పేసాడు సతీష్ వేగేశ్న

English summary
Director satish vegeshna shared off screan jurny of the Movie Satamaanam bhavati, in a latest interview
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu