For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాతో ఎవరూ చేయించడం లేదు: ఫీలవుతున్న బాలయ్య (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: నారారోహిత్ హీరోగా, నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం 'సావిత్రి'. ఈ చిత్రాన్ని ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వంలో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రవణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెక్షన్ సెంటర్ లో జరిగింది.

  నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీలు విడుదల చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 'సినిమా నేపథ్యం చూస్తుంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రంగా కనపడుతుంది. అలాగే టైటిల్ చూస్తుంటే లెజెండ్ లో స్త్రీల గురించి, వారి గొప్పతనాన్ని గురించి నేను చెప్పిన డైలాగ్ గుర్తుకు వస్తుంది. నారారోహిత్ తన స్టయిల్ లో మేథడికల్ యాక్టింగ్ తో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నాడు’ అన్నారు.

   Savithri Movie Audio Launch

  సంగీతం గురించి బాలయ్య మాట్లాడుతూ బాలయ్య ఎప్పటి నుండో తన మనసులో ఉన్న కోరికను బయట పెట్టారు. ''సంగీతం చాలా గొప్పది. కొన్ని రోగాలను కూడా నయం చేయవచ్చునని చరిత్ర చెబుతుంది. అలాంటి సంగీతాన్ని వినసొంపుగా మార్చిన శ్రవణ్ ను అభినందిస్తున్నాను. పాటలు బావున్నాయి. నాకు సినిమాల్లో పాటలు పాడాలని ఉంది కానీ, ఎవరూ పాడించడం లేదు. అలా నాతో ఎవరూ చేయించక పోవడంతో స్టేజీలపై పాడుతున్నాను. రోహిత్ ఈ సినిమాలో పాట పాడాడు. అందుకు తనను అభినందించాలి'' అన్నారు.

  నారారోహిత్ మాట్లాడుతూ ''నేను ఈ స్టేజ్ కు రావడానికి కారణం మా పెద్దనాన్న చంద్రబాబునాయుడుగారు, నాన్నగారు. నేను సినిమాల్లోకి వెళాతనని అనగానే వారు బాగా సపోర్ట్ చేశారు. అలాగే బాలకృష్ణగారు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తున్నారు. రెండు సంవత్సరాలు క్రితం ఈ కథ విన్నాం. లేట్ గా స్టార్టయినా, మంచి నిర్మాత రాజేంద్రప్రసాద్ దొరకడంతో సినిమా క్వాలిటీగా రావడానికి ఆయనే కారణం. పవన్ సాధినేని సినిమాను బాగా హ్యండిల్ చేశాడు. సోలో తర్వాత అలాంటి సినిమా సావిత్రి అవుతుంది. ఆ సినిమాలాగానే ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. శ్రవణ్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. టీం అందరికీ థాంక్స్'' అన్నారు.

   Savithri Movie Audio Launch

  తారకరత్న మాట్లాడుతూ 'అద్భుతమైన దర్శకుడు, నిర్మాత, హీరో, హీరోయిన్ సహా అద్భుతమైన టీం దరూపొందించిన సినిమా సావిత్రం. సోలో తర్వాత ఈ సినిమా పవన్ బావ, నారారోహిత్ బావకు పెద్ద హిట్ అవుతుంది'' అన్నారు.

  నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ'' ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఎటువంటి వల్గారిటీ లేకుండా చక్కగా ఉంటుంది. నారారోహిత్ గారి ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ అవుతుంది. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరికీ థాంక్స్'' అన్నారు.

  డైరెక్టర్ పవన్ సాధినేని మాట్లాడుతూ ''మా నాన్నగారు బాలకృష్ణగారికి పెద్ద అభిమాని. రాజేంద్రప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. ఎంటర్ టీంకు మా పెద్దన్నయ్యలా ఉండి, సపోర్ట్ చేశారు. శ్రవణ్ మంచి ఆల్బమ్ ఇచ్చారు. యూత్ సినిమాకైతే ఒక టికెట్ తెగితే, ఫ్యామిలీ సినిమాకు ఇంట్లోని టికెట్స్ అన్నీ తెగుతాయని అనడంతో సావిత్రి లాంటి ఫ్యామిలీ సినిమా చేశాను. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.

   Savithri Movie Audio Launch

  మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ మాట్లాడుతూ 'ఈ ఆల్బమ్ లో నారా రోహిత్ గారు పాడటటమే హైలైట్. చాలా డేడికేషన్ తో సాంగ్ పాడారు. ఆ పాట పెద్ద హిట్టయింది. పవన్ సాధినేనితో మంచి పరిచయం ఉంది. అవకాశం ఇచ్చి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.

  నందిత మాట్లాడుతూ ''ఫ్యాబులస్ మూవీ. నాకు ఇలా ఒక మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. మంచి టీంతో పినచేసినందుకు ఆనందంగా ఉంది'' అన్నారు.

   Savithri Movie Audio Launch

  నటీనటులు : నారా రోహిత్, నందిత, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, అజయ్, రవి బాబు, జీవా, వెన్నెల కిషోర్, శ్రీముఖి , ధన్య బాలకృష్ణన్, మధు నందన్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను షకలక శంకర్ తదితరులు.

  సాంకేతిక విభాగం : సినిమాటోగ్రఫీ - వస్సంత్ , డైలాగ్స్ - కృష్ణ చైతన్య, సంగీతం - శ్రవణ్ , ఎడిటర్ - గౌతం నెరుసు, ఆర్ట్ డైరెక్టర్: హరి వర్మ, ఫైట్స్ - డ్రాగన్ ప్రకాష్, కో డైరెక్టర్: సురేష్, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ - జాబిల్లి నాగేశ్వర రావు, నిర్మాత - డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - పవన్ సాదినేని.

   Savithri Movie Audio Launch
   Savithri Movie Audio Launch
   Savithri Movie Audio Launch
   Savithri Movie Audio Launch
   Savithri Movie Audio Launch
   Savithri Movie Audio Launch
   Savithri Movie Audio Launch
   Savithri Movie Audio Launch
   Savithri Movie Audio Launch
   Savithri Movie Audio Launch
   Savithri Movie Audio Launch
   Savithri Movie Audio Launch
   Savithri Movie Audio Launch
   Savithri Movie Audio Launch
   Savithri Movie Audio Launch
   Savithri Movie Audio Launch
   Savithri Movie Audio Launch
   Savithri Movie Audio Launch
  English summary
  Savithri Movie Audio Launch event held at Hyderabad. Nandamuri Balakrishna, Actor Nara Rohith, Actress Nanditha Raj, Sri Mukhi, Manasa, Dhanya Balakrishna, Shraddha Das, Rashmi Gautam, Director Pavan Sadineni, Sai Korrapati, Karthik Ghattamaneni, Taraka Ratna, Praveen Sattaru, Satyam Rajesh, Ajay, Bekkam Venugopal, Sai Karthik graced the event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X