»   » నారా రోహిత్ ‘సావిత్రి’ అఫీషియల్ టీజర్

నారా రోహిత్ ‘సావిత్రి’ అఫీషియల్ టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్‌, నందిత హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'సావిత్రి'. పవన్‌ సాదినేని దర్శకత్వంలో, విజన్‌ ఫిలింమేకర్స్ పతాకంపై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టీజర్ విడుదలైంది. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది.

ఇది ఒక పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని, రోహిత్‌, నందితల కాంబినేషన్‌ ఈ చిత్రానికి ఎంతో ప్లస్‌ అవుతుందని, ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాత తెలిపారు. 'ప్రేమ ఇష్క్ కాదల్‌' చిత్రంతో మంచి గుర్తింపు లభించిందని, ఇప్పుడు నారా రోహిత్‌తో 'సావిత్రి' చిత్రాన్ని ఒక పూర్తి కమర్షియల్‌ ఫామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నట్లు దర్శకుడు పవన్‌ సాదినేని తెలిపారు. రోహిత్‌ పెర్ఫామెన్స్ లో, బాడీ లాంగ్వేజ్‌లో ఎంతో కొత్తదనం ఉంటుందన్నారు.

‘బాణం' చిత్రం నుండి ఇటీవల విడుదలైన ‘అసుర' చిత్రం వరకు విభిన్న చిత్రాల్లో హీరోగా నటిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్ ‘సావిత్రి' చిత్రంతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్న చిత్రబృందం తాజాగా ‘సావిత్రి' చిత్ర టీజర్ ని విడుదల చేసింది. మార్చి 25న ‘సావిత్రి' చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

English summary
Watch Savithri Official Teaser, starring Nara Rohith, Nanditha and others. Directed by Pavan Sadineni. Music composed by Shravan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu