»   » వయసు పెద్దగా కనిపించేందుకు ట్రీట్మెంటా...? రాజ్ తరుణ్ వెనక ఇంత కథ ఉందా...!?

వయసు పెద్దగా కనిపించేందుకు ట్రీట్మెంటా...? రాజ్ తరుణ్ వెనక ఇంత కథ ఉందా...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

డాక్టర్ అవుదామనుకొని యాక్టర్ అయ్యేవాళ్ళెంత మందో గానీ... ఏదో అవుదాం అని వచ్చి నటులుగా మారిపోయిన వళ్ళు మాత్రం ఇండస్ట్రీ లో కోకొల్లలు గా కనిపిస్తారు. యువ హీరో రాజ్ తరుణ్ కూడా అలాగే డైరెక్టర్ అవుదామని సినిమాల్లోకి వచ్చిన ఈ కుర్రాడు అనుకోకుండా హీరో అయిపోయాడు. అలా ఇలా కాదు మనోడు ఇప్పటి వరకూ అయిదు సినిమాలు చేస్తే అందులో నాలుగు హిట్ టాక్ తెచ్చుకున్నవే.

షార్ట్ ఫిలింస్ లో తనను తాను నిరూపించుకొని సినిమాల్లోకి వచ్చి డైరెక్టర్ అవుదామనుకున్న రాజ్ తరుణ్ నటుడవ్వటం వెనుక ఒక షాకింగ్ స్టోరీ ఉంది. రాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయటానికి ఒక సినిమాకి పని చేయటం మొదలు పెట్టాడు. ఆ సినిమానే 'ఉయ్యాల జంపాల'. కానీ ఆ సినిమాకు ప్రి ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే అనుకోకుండా అదే సినిమాలో హీరో పాత్రకు సెలక్టయిపోయాడు. ఐతే డైరెక్టర్ విరించి వర్మకు మాత్రం రాజ్ తరుణ్‌ను హీరోగా తీసుకోవడం ఇష్టం లేదట. అతను ఆ పాత్రకు సరిపోడేమో అని సందేహించాడట. ఎందుకంటే రాజ్ తరుణ్ అప్పటి మరీ పిల్లాడిలా కనిపిస్తున్నాడు మరి. అందుకే ఒక వింత నిర్ణయం తీసుకొని తరుణ్ ని మార్చేసారట... ఎలాగో తెలుసా..!? విరించి వర్మ మాటల్లోనే వినడి...

secret behind Raj tarun's Hero entry

''ఉయ్యాల జంపాల సినిమా నటీనటుల కోసం ఆడిషన్స్ చేస్తున్న టైంలో ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాజ్ తరుణ్ మీద నిర్మాత రామ్మోహన్ ఆసక్తి చూపించారు. అతణ్నే హీరోగా పెడదామన్నారు. ఐతే బాగా చిన్నవాడిలా కనిపిస్తున్నాడని అభ్యంతరం వ్యక్తం చేశాను. దీంతో ఈ సినిమా కాస్టింగ్ డైరెక్టర్ గీత గారు తరుణ్‌కు రెండు నెలల పాటు ఆక్యుపంక్చర్ చేయించారు.

దాంతో రెండేళ్లు వయసు పెరిగినట్లు కనిపించాడు. దీనికి తోడు సినిమా షూటింగ్ మొదలవడానికి సమయం పట్టింది. ఈ లోపు ఇంకొంచెం ఒళ్లు చేశాడు. వయసు పెరిగినట్లు కనిపించాడు. దీంతో అతను హీరో పాత్రకు సరిగ్గా సరిపోయాడు. హీరోయిన్ కోసం మూడు నెలలు ఇంటర్నెట్లో వెతికాం. అవికా గోర్ చేసిన సీరియల్ నేను చూడలేదు. ఐతే యూట్యూబ్‌లో ఆమె వీడియో ఒకటి చూశాక ఆడిషన్స్ చేసి ఓకే చేశాం. అలా 'ఉయ్యాల జంపాల'కు హీరో హీరోయిన్లు కుదిరారు'' అని ఈ మధ్య చెప్పిన ఇంటర్వ్యూ లో చెప్పాడు విరించి వర్మ..

English summary
Director Virinchi Varma revealed the secret behind raj tarun's entry as Hero in Uyyala jampala Movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu