For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాంగోపాల్ వర్మ మీడియాకు ఐటెం.. కెరీర్ నీచ స్థానానికి పోవడానికి కారణం ఇదేనా!

  By Rajababu
  |

  తెలుగు సినిమా దశ, దిశను మలుపు తిప్పిన దర్శకుల్లో ఒకరని రాంగోపాల్ వర్మ అనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. మూస సినిమాలు రాజ్యమేలుతున్న సమయంలో శివ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమను ఓ కుదుపు కుదిపేశాడు. శివ సినిమాతో ఆయన సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినిమా పరిశ్రమ గురించి చెప్పాల్సి వచ్చినపుడు శివకు ముందు, శివకు తర్వాత అనే ప్రస్తావన వచ్చేది. శివ తర్వాత ఎందరో సినీ ప్రేమికులకు దర్శకుడిగా మారాలనే ఆలోచనను పుట్టించింది కేవలం రాంగోపాల్ వర్మ అని బల్లగుద్ది చెప్పవచ్చు. అలాంటి వ్యక్తి అయిన వర్మ పరిస్థితి చాలా నీచంగా ఉంది. మానసిక ప్రవర్తన, తీసే సినిమాలు చాలా నాసిరకంగా ఉంటున్నాయి. అలాంటి వాటికి కారణం ఆయన జాతక, గ్రహబలమనే వాదనను జోతిష్కుడు వేణుస్వామి చెప్తున్నారు. రాజమౌళి జాతకం గురించి చెప్తూ వర్మ మానసిక, గ్రహబల పరిస్థితిని విశ్లేషించాడు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఉన్న ఆ వీడియో వైరల్‌గా మారింది.

  శివతో సంచలనం..

  శివతో సంచలనం..

  శివ తర్వాత బాలీవుడ్‌లోకి ప్రవేశించి అక్కడ సంచలన విజయాలను సాధించాడు. ఇండియాలోనే టాప్ డైరెక్టర్లలో ఒకడిగా మారారు. ఆయన తీసిన రంగీలా, సత్య, సర్కార్ సినిమాలు మాస్టర్ పీస్‌లుగా మారాయి. బాలీవుడ్‌లో ఆయనతో సినిమాలు చేయాలని ఎందరో ప్రయత్నించారు. ప్రస్తుతం వర్మ అంటేనే భయపడే స్థితి వచ్చింది.

  గతంలో వర్మ కోసం మీడియా..

  గతంలో వర్మ కోసం మీడియా..

  గతంలో రాంగోపాల్ వర్మను ముంబైలో పట్టుకోవాలంటే తెలుగు మీడియా చాలా రోజులు తంటాలు పడాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం రాంగోపాల్ వర్మ పరిస్థితి ఎలా ఉందంటే గంట గంటకు ఓ తెలుగు టీవీ చానెల్లో కనిపిస్తాడు. మీడియా ప్రాపకం కోసం వెంపర్లాడుతున్నాడు. భారతీయ సినిమా పరిశ్రమలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వర్మ కెరీర్ చాలా నీచమైన స్థాయికి పడిపోయింది అని వేణుస్వామి అనే జ్యోతిష్కుడు విశ్లేషించాడు.

  ట్వీట్లతో వివాదం..

  ట్వీట్లతో వివాదం..

  ప్రస్తుతం నానా రకాల ట్వీట్లతో సోషల్ మీడియాలో వర్మ వివాదాస్పదమవ్వడం తెలిసిందే. ప్రస్తుతం మీడియాకు ఆయన ఓ ఐటెంగా మారాడు. ఆయన ట్వీట్లను చూస్తే ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని అనిపిస్తుంటుంది. గొప్ప డైరెక్టర్‌ అయిన వర్మకు ఇలాంటి ట్వీట్లు అవసరమా అనిపిస్తుంటుంది. దీనంతటికి కారణం ఆయన తలపై తిరుగుతున్న గ్రహాలే కారణమని ఆయన అన్నారు.

  బెడిసికొట్టిన ప్రయోగాలు

  బెడిసికొట్టిన ప్రయోగాలు

  హిందీలో రంగీలా, సత్య, సర్కార్ లాంటి సినిమాలతో జోరు మీద ఉన్న రాంగోపాల్ వర్మ 5డీతో కెమెరాతో సినిమా తీయవచ్చని ప్రయోగం చేశాడు. అమితాబ్, సంజయ్‌దత్, రానా, మంచులక్ష్మితో తీసిన డిపార్ట్‌మెంట్ సినిమా తీసినన్నీ రోజులు కూడా నడువలేదు. ఆయన ప్రయోగం దారుణంగా విఫలమైంది. ఆ తర్వాత తెలుగులో దొంగల ముఠా తీశాడు. దాని పరిస్థితి కూడా అలానే ఏడ్చింది. ఇలా రకరకాల అవమానాలకు గురికావడం గ్రహ, జాతక బలమనే వాదనను ఆయన వినిపించాడు.

  గ్రహాల ప్రభావమే కారణం..

  గ్రహాల ప్రభావమే కారణం..

  శివ లాంటి గొప్ప సినిమా తీసిన వ్యక్తి ఐస్‌క్రీమ్ లాంటి సినిమా తీయడం ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. ఐస్‌క్రీమ్1 నుంచి 10 వరకు సీక్వెల్ తీస్తానని చెప్పడం వర్మ మానసిక స్థితికి అద్దం పట్టింది అనే వాదన అప్పట్లో వినిపించింది. ఆ తర్వాత రక్త చరిత్ర, వంగవీటి చిత్రాలను తీసినా రావాల్సిన పేరు రాకపోగా వివాదాలు చుట్టు ముట్టాయి. వర్మ కెరీర్‌లో ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకోవడానికి కారణం రాహువు, కేతువు, శని గ్రహాల ప్రభావమే అని చెప్పుకొచ్చారు.

  ప్రతీ ఒక్కరికీ అదే పరిస్థితి..

  ప్రతీ ఒక్కరికీ అదే పరిస్థితి..

  గ్రహాలు అనుకూలంగా లేని కారణంగా అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని, వర్మ కూడా అదే పరిస్థితి ఎదురైందని జ్యోతిష్కుడు వేణుస్వామి చెప్పారు. వర్మ చేస్తున్న ట్వీట్లు, తీసుకొంటున్న నిర్ణయాలన్నీ గ్రహాల ఫలితమేనని ఆయన చెప్పారు. అంతేకాని వర్మ కావాల్సి చేసినవి కాదని వివరణ ఇచ్చారు. ఏ మనిషికైనా జీవితంలో చాలా నీచమైన స్థితి ఎదురువుతుందని పేర్కొన్నారు.

  English summary
  Director Ram Gopla Varma is sensational after Shiva movie. He achieved many mile stones in Indian film industry. But now he is struggling to get success. Astrologers believe that Astrological aspects behind the his failures.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X