For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భార్య చేయి విడవని బన్నీ....ఏళ్లు గడిచినా అదే సీన్, సూపర్! (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... నటుడిగా తను అనుకున్నది సాధించేందుకు చాలా కష్టపడే హీరో. అందుకే ఈతరం హీరోల టాప్ లిస్టులో స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోనూ తన సినిమాల మార్కెట్ విస్తరిస్తూ సౌత్ స్టార్‌గా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు బన్నీ.

  Also Read: అల్లు అర్జున్ మళ్లీ తండ్రి కాబోతున్నాడా? (ఈ ఫోటోలే సాక్ష్యం!)

  ప్రొఫెషనల్ గానే కాదు.... వ్యక్తిగత జీవితంలోనూ తన అనుకున్నది సాకారం చేసుకున్నాడు స్టైలిష్ స్టార్. ప్రేమించిన అమ్మాయినే భార్యగా పొందాడు. ప్రాంతం, కులం అనే పట్టింపులు ఏమీ లేకుండా పెద్దలను ఒప్పించి స్నేహా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.

  Also Read: ఎందుకు ఎదగనిస్తారు? దెబ్బలు, అవమానాలు: చిరంజీవి గురించి పవన్!

  తెలుగులో చాలా మంది హీరోలు బయటి కార్యక్రమాలకు భార్యలతో హాజరు కావడం అరుదు. అయితే బన్నీ మాత్రం ఏ కార్యక్రమానికి హాజరైనా భార్యతో కలిసి కనిపించడం విశేషం. అంతే కాదు... ఎక్కడికెళ్లిన భార్య చేయి పట్టుకుని కనిపించడం గమనార్హం.

  పెళ్లైన దగ్గర నుండి బన్నీ వివిధ కార్యక్రమాలకు భార్యతో కలిసి హాజరైన ఫోటోలు చూస్తే.... భార్యపై బన్నీ ఎంత ప్రేమ పెంచుకున్నాడో అర్థమవుతుంది. దాదాపు అన్ని సందర్భాల్లోని ఫోటోలు ఒకే సీన్ లా కనిపిస్తాయి. మూడు ముళ్లు వేసిన తర్వాత బన్నీ భార్య చేయి పట్టుకుని ఎలా నడిచాడో...నిజ జీవితంలో, దాదాపు ప్రతి సందర్భంలోనూ భార్యతో అలానే ఉండటం కేవలం బన్నీకే చెల్లింది.

  ఈ సందర్భంగా 'వరుడు' సినిమాను గుర్తు చేసుకుంటే...బన్నీ ఆ సినిమాలో తనకు కావాల్సిన భార్య గురించి కలలు కనడం, తన కలను సాకారం చేసుకోవడం, జీవితాంతం నీ చేయి వదలను అని వేద మంత్రాల సాక్షిగా ప్రమాణం చేయడం చూస్తాం. నిజ జీవితంలోనూ బన్నీకి తాను కోరుకున్న విధంగా భార్య దొరకడం నిజంగా అదృష్టం.

  స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు...

  పెళ్లి నాటి ఫోటో..

  పెళ్లి నాటి ఫోటో..

  అల్లు అర్జున్, స్నేహారెడ్డి పెళ్లి నాటి ఫోటో. ఇందులో బన్నీ తన భార్య చేయి పట్టుకుని ఎలా నడిచాడో రియల్ లైఫ్ లోనూ అలానే ఇప్పటికీ మెయింటేన్ చేస్తున్నాడు..

  మరో కార్యక్రమంలో..

  మరో కార్యక్రమంలో..

  ఓ వివాహ వేడుకకు తన భార్యతో కలిసి హాజరైన బన్నీ.. భార్య చేయి పట్టుకున్న తీరును ఎలా ఉందో చూడండి.

  ఇక్కడా అదే సీన్..

  ఇక్కడా అదే సీన్..

  మరో కార్యక్రమంలో భార్యతో కలిసి వస్తున్న బన్నీ... మళ్లీ అదే సీన్.

  వావ్ సూపర్

  వావ్ సూపర్

  వావ్... ఇక్కడ కూడా బన్నీ, స్నేహారెడ్డి అదే విధంగా చేయి పట్టుకుని...

  బన్నీకే చెల్లింది

  బన్నీకే చెల్లింది

  ఇలా ఉండటం కేవలం బన్నీకి మాత్రమే చెల్లింది కాబోలు. ఇతర తెలుగు హీరోల విషయంలో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూడలేదు.

  కొండంత ప్రేమ

  కొండంత ప్రేమ

  బన్నీ భార్యపై కొండంత ప్రేమ పెంచుకున్నాడనడానికి ఇదే నిదర్శనం.

  స్నేహ అదృష్టం

  స్నేహ అదృష్టం

  అల్లు అర్జున్ లాంటి భర్త దొరకడం నిజంగా స్నేహా రెడ్డి అదృష్టం అని చెప్పక తప్పదేమో!

  భార్యతో...

  భార్యతో...

  తెలుగు హీరోలు చాలా మంది తమ భార్యలను తమతో బయటకు తీసుకురారు. బన్నీ మాత్రం అందుకు భిన్నమనే చెప్పాలి...

  చిరు బర్త్ డే వేడుకలో..

  చిరు బర్త్ డే వేడుకలో..

  గతేడాది జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో బన్నీ, స్నేహారెడ్డి

  హరితహారంలో...

  హరితహారంలో...

  నిన్న హైదరాబాద్ లో జరిగిన హరిత హారం కార్యక్రమంలో కూడా బన్నీ, స్నేహారెడ్డి చేయి పట్టుకుని అదే సీన్...

  English summary
  We have a small but the sweetest observation to share with you all about the most loveable couple of T-town, Allu Arjun and Sneha Reddy. If you have been following them, you must have already fell in love with their PDA, as they set some major relationship goals at each point. But, have you ever observed this cutest thing that, they always walk hand in hand at any damn event and it is amazing how Allu Arjun has been doing this right from the day of their marriage to now.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X