twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తొలిసారిగా శేఖర్‌ కమ్ములకి గొప్ప అవకాశం..కంగ్రాట్స్

    By Srikanya
    |

    ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ వంటి జనరంజక చిత్రాల ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల అంతర్జాతీయ కేన్స్‌ చిత్రోత్సవాలకు హాజరవుతున్నారు. జాతీయ చలన చిత్ర అభివృద్ధి మండలి (ఎన్‌ఎఫ్‌డీసీ) మన దేశం నుంచి ఆరుగురు సినీ ప్రముఖుల్ని కేన్స్‌కి పంపిస్తోంది. వారిలో శేఖర్‌ కూడా ఉన్నారు. దివాకర్‌ బెనర్జీ (హిందీ), అనురాగ్‌ కాశ్యప్‌ (హిందీ), అనూష రిజ్వి (హిందీ), లక్ష్మీకాంత్‌ షిట్నోగర్‌ (కొంకణీ), హోబమ్‌ పవన్‌కుమార్‌ (మణిపురీ) దర్శకులు ఆ జాబితాలో ఉన్నారు. ఈ చిత్రోత్సవంలో ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాలకు చెందిన సుప్రసిద్ధ సినీ దర్శకులు, నిర్మాతలు పాల్గొంటున్నారు. భారత సమాచార ప్రసార శాఖ తరఫున కేన్స్‌లో ఎన్‌ఎఫ్‌డీసీ ఓ విభాగాన్ని ఏర్పాటు చేస్తోంది. దాని ద్వారా భారతీయ చలనచిత్రాలు, మార్కెట్‌ తదితర అంశాల్ని విదేశీ ప్రతినిధులకు వివరిస్తారు. ఆ కార్యక్రమంలో పాలుపంచుకొనేందుకు ఈ ఆరుగురు సినీ ప్రముఖుల్నీ ఎన్‌ఎఫ్‌డీసీ ఎంపిక చేసింది. బుధవారం ఈ చిత్రోత్సవాలు మొదలయ్యాయి. ఈ నెల 22న వరకూ జరుగుతాయి. ఈ సందర్భంగా ధట్స్ తెలుగు ఈ దర్శకుడుకి శుభాకాంక్షలు అందచేస్తోంది.

    English summary
    Filmmaker Sekhar Kammula is set to hobnob with the who's who at Cannes. The director has been selected by National Film Development Corporation(NFDC) as part of the group that includes Anurag Kashyap, Anusha Rizvi, Dibakar Banerjee, Lakshmikant Shetgaonkar and Haobam Paban Kumar, a documentary filmmaker from Manipur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X