»   » 'లీడర్' తర్వాత నెక్ట్స్ చిత్రం అదే: శేఖర్ కమ్ముల

'లీడర్' తర్వాత నెక్ట్స్ చిత్రం అదే: శేఖర్ కమ్ముల

Posted By:
Subscribe to Filmibeat Telugu

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'లీడర్' చిత్రం ఈ నెల(పిబ్రవరి)19న రిలీజ్ అవుతోంది. అయితే ఆ తర్వాత ఆయన ఏ సబ్జెక్టుపై ఎవరితో చిత్రం చేయబోతున్నాడనేది అందరికీ ఆసక్తి కరమే. ఈ మేరకు ఆయన్ని మీడియా మీ తదుపరి చిత్రం ఏది అని అడిగినప్పుడు ఆయన సమాధానంగా...'హ్యాపీడేస్'ని హిందీలో చేయడానికి సిద్ధమయ్యాను అన్నారు. తెలుగులో సంచలన విజయం సాధించిన హ్యాపీడేస్ ను ఆయన మరోసారి తెరకు హిందిలో కొత్త నటీనటులతో రూపొందించటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే టాలెంట్ హంట్ ద్వారా ఆ నటీనటుల ఎంపికను పూర్తి చేసారని తెలుస్తోంది. అలాగే తెలుగు హ్యాపీడేస్ కు హిందీకి మౌళికంగా కొన్ని మార్పులు ఉంటాయని చెప్తున్నారు. మరో ప్రక్క విద్యావవస్ధపై క్యాపస్ నేపధ్యంలో జరిగే కథతో రూపొందించిన త్రీ ఇడియట్స్ హిట్టవటం కూడా హ్యాపీడేస్ ని హిందిలో చేయటానికి ఓ కారణమని భావిస్తున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu