»   »  ‘వయసు మీద పడింది.. రొమాన్స్ చేయలేను’

‘వయసు మీద పడింది.. రొమాన్స్ చేయలేను’

Posted By:
Subscribe to Filmibeat Telugu

వయసు మీద పడింది ఇక తెరమీద రొమాన్స్ చేయలేను అంటున్నాడు కింగ్ ఆఫ్ రొమాన్స్ షారుక్ ఖాన్. 51 ఏండ్ల వయస్సులో వెండితెర మీద అన్ని చేయాలని ఆశపడటం కూడా అత్యాశే అవుతుందని పేర్కొన్నాడు. ఈ జనరేషన్ లో ప్రేమ కథా చిత్రాల్లో నటించడం సబబు కాదని అన్నాడు. ఈ తరం యువత అభిరుచులు వేగంగా మారుతున్నాయని, తన కూతురు సుహానా ఇంట్లో తనను బ్రో (అన్న) పిలుస్తుందని తెలిపాడు. తనను బ్రో అని పిలిచినపుడు బయటవారిని కూడా అన్న అని పిలుస్తావా అని చమత్కరిస్తుంటానని అన్నాడు.

Shah Rukh Khan says I can not do romance at this age

తాను నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్ కుచ్ హోతా హై చిత్రాలు ఇప్పటి తరం కూడా ఆదరించడం తన అదృష్టమని అన్నాడు. గతంతో పోల్చుకుంటే ఈ తరం వారి రొమాన్స్ రూపు మార్చుకున్నదని పేర్కొన్నారు. నిజజీవితంలో శృంగార జీవితాన్ని అనుభవించడానికి జనాలకు సమయమే లేదనే అభిప్రాయాన్ని షారుక్ వ్యక్తం చేశారు.

తనకు పెరిగిన పిల్లలు ఉన్నారని, వారి ముందు ఈ వయస్సులో కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేయడం బాగుండదని అన్నారు. తాను యువకుడిగా ఉన్నపుడు బీచ్ లో ప్రియురాలి చేతిలో చేయి వేసి నడిచే వాడినని, అర్ధరాత్రి పండు వెన్నెలలో నడుచుకుంటూ వెళ్లడం గొప్ప అనుభూతి అని పేర్కొన్నాడు. శృంగార జీవితం అనుభవించడానికి సరైన సమయం ఉండాలని, ప్రస్తుతం ఆ సమయం ఈ తరం వారికి లేదని షారుక్ అన్నాడు.

English summary
Shah Rukh Khan says he is now too old to do larger than life love stories.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu